తిరుపతిజిల్లా-వెంకటగిరి-18-02-2024
వెంకటగిరి లోని నేదురుమల్లి నివాసంలో N. J. R భవనంలో వెంకటగిరి మున్సిపాలిటీలోని వైఎస్ఆర్సిపి నాయకులకు వార్డు కౌన్సిలర్లకు, కార్యకర్తలకు విస్తృతస్థాయి సమావేశమును ఏర్పాటు చేశారు. ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా వెంకటగిరి రాజా కుటుంబీకులు, ఎస్ వి బి సి చైర్మన్ డాక్టర్ వి బి సాయి కృష్ణ యాచేoద్రగారు, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త, గౌరవ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రామ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ…
తన తల్లిదండ్రులు తండ్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, రాజ్యలక్ష్మిమ్మ గారు బాటలోనే వెంకటగిరి ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటామని చెప్పినారు. వైఎస్ఆర్సిపి కి జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గలో మెజార్టీ సాధించడానికి అందరం కలిసి పనిచేద్దామని చెప్పినారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పరంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అని తన గొప్పలు తాను చెప్పుకుంటూ నెరవేర్చలేని హామీలతో ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆంధ్ర రాష్ట్ర విభజన అనంతరం అనుభవం ఉన్న వ్యక్తి అని చంద్రబాబు నాయుడుకి ప్రజల పట్టం కడితే ప్రజలకు ఇచ్చిన హామీల్లో పూర్తిస్థాయిలో అమలు చేయకపోగా ప్రజలను మోసం చేశారన్నారు. చంద్రబాబు నాయుడు నాడిని పరిశీలించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అవకాశం కల్పించినట్లు తెలిపారు. తొలిసారిగా అధికారం చేపట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా చెప్పిన దానికంటే మిండగా సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల ఇంటి ముంగిటకే పథకాలు అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు . రానున్న ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అండగా ఉన్నారని ఈసారి కూడా జగనన్నే ముఖ్యమంత్రిగా అవుతాడని ఆశ భావం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు అవగాహన కల్పించడమే కాకుండా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో బరిలో తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజలందరూ తమకు మద్దతుగా ఉండాలని సూచించారు. అసంతృప్తితో ఉన్న క్యాడర్ను సమన్వయం చేసుకుంటూ ప్రజలతో మమేకమయ్యే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు నాయకులకు నేదురుమల్లి కుటుంబం ఎల్లవేళలా అండగా ఉంటుందని. ఏ సమయంలో అయినా సరే తన నివాసం వద్ద ప్రజలకు అందుబాటులో ఉంటానని సూచించారు. రానున్న ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయంగా ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎస్ వి బి సి చైర్మన్ డాక్టర్ విబి సాయికృష్ణ యచేంద్ర మాట్లాడుతూ… సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి నియోజకవర్గంలో సమర్థవంతమైన నాయకుడైన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిగారిని నియమించారని, వెంకటగిరి మరింత అభివృద్ధి చెందాలంటే రామ్ కుమార్ రెడ్డి గారిని వెంకటగిరి ఎమ్మెల్యేగా చేసుకోవాల్సిన అవసరం ప్రతి వైఎస్ఆర్సిపి కార్యకర్త నాయకులకు ఉందని సూచించారు…