10-15మంది సిట్టింగుల పేర్లు తారుమారే..!
తాజాగా మూడో జాబితా కూడా సిద్ధం చేశారని సమాచారం
గూడూరు మార్పు తథ్యం..?
మూడో జాబితలో పేర్లు వెల్లడి
బాలాయపల్లి :-
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారు తున్నాయి. వైసీపీ మినహా అన్నీ పార్టీలు ఎన్నికల పొత్తుపై కసరత్తు చేస్తుంటే అధికార పార్టీ మాత్రం ఎన్నికల అభ్యర్ధులు వడపోత కార్యక్రమం చేపడు తోంది.వై నాట్ 175 అనే స్టేట్ మెంట్ నిజం చేసి చూపించాలనే పట్టుదలతో బలహీనంగా, ప్రజాదర ణ పొందని నేతలను మార్చి వారి స్థానం లో వేరే వారిని నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే రెండు జాబితాల ద్వారా పలువురికి నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించింది. తాజాగా మూడో జాబితా కూడా సిద్ధం చేసినట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఈ జాబితాలో మరో 10-15మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లు తారుమారు కాను న్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే తప్పించిన వారిలో కొందరు అసంతృప్తితో వేరే పార్టీలపై వైపు చూస్తుంటే మళ్లీ వైసీపీ అధిష్టానం మరో 10 నుంచి 15 మందికి చెక్ పెడుతోందన్న వార్త పార్టీలోనే కాదు అటు క్యాడర్ లో కూడా నిరుత్సాహాన్ని కలిగిస్తోంది.
నియోజకవర్గాలను తారుమారు :-
వైసీపీ స్ట్రాటజీ విచిత్రంగా ఉంది. ఈసారి ఆంధ్ర ప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్ని ప్రతిపక్ష పార్టీలు ఎంత సవాల్ గా తీసుకున్నాయో అంత కంటే ప్రెస్టేజియస్ గా వైసీపీ తీసుకున్నట్లుగా కనిపి స్తోంది. అందుకే గత ఎన్నికల్లో 151 మంది ఎమ్మె ల్యేలుగా విజయం సాధిస్తే ..ఈసారి వారిలో కొంద రికి గెలుపు అవకాశాలు లేవని సర్వేలో తేలడంతో జగన్ ఎమ్మెల్యేల పేర్లను, నియోజకవర్గాలను తారుమారు చేసి బరిలోకి దింపాలని చూస్తున్నా రు. ఇందులో భాగంగానే మొదటి జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని 11మందికి నియోజ కవర్గ �
ఇన్చార్జులుగా ప్రకటించారు. అటుపై రెండో జాబితా కూడా విడుదల చేసి మిగిలిన ఎమ్మెల్యే లకు షాక్ ఇచ్చారు. రెండో జాబితాలో 27మంది నేతలను మార్చింది వైసీపీ అధిష్టానం. ఇక ఇప్పు డు మూడో లిస్ట్ కూడా రెడీ చేసినట్లుగా తెలుస్తోం ది. ఈజాబితాలో కూడా 10 నుంచి15మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలు, పేర్లు తారుమారు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
గూడూరు అభ్యర్థి ఎంపిక పై ఉత్కంఠం :-
గూడూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మార్పు తథ్యం అయి నా నేపథ్యంలో నూతన అభ్యర్థి ఎవరినేది ఉత్కం ఠం నెలకొంది. సియం జగన్ మదిలో అభ్యర్థి పేరు ఖరారు చేసి ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం ఆ పేరు మూడో విడత జాబితా లో విడుదల చేయ నున్నారు. రేపు సాయంత్రం లోపు ఉమ్మడి నెల్లూ రు జిల్లా మూడో జాబితా విడుదల కానున్నట్లు సమాచారం. గూడూరు నియోజకవర్గం తెర పై ఎంతోమంది పేర్లు వచ్చిన ఆ పేర్లు తాడేపల్లి వైసీపీ కార్యాలయం గెట్ వద్దకు కుడా పోలేదు అనీ వైసీపీ పెద్దలు చెబుతున్నారు. జగన్ మదిలో ఆల్ మోస్ట్ అభ్యర్థి పేరు ను ఖరారు చేసినట్లు చెబుతున్నారు.
పోటో :-వైఎస్ జగన్ మోహాన్ రెడ్డీ