విజయవాడ : ఏపీ సీఎం జగన్‌పై సీపీఐ నేత నారాయణ సెటైర్లు వేశారు. వైసీపీ
ప్రభుత్వం నరేంద్రమోదీ కనుసన్నల్లో పనిచేస్తోందని విమర్శించారు. కేంద్రం
ఎలాంటి బిల్లు ప్రవేశపెట్టినా జగన్ సమర్ధిస్తున్నారని చెప్పారు. ప్రధానికి
అనుకూలంగా ఉన్నారు కాబట్టే జగన్‌పై చర్యలు తీసుకోవడంలేదని అన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం బెయిల్‌పై బయట ఉన్న వ్యక్తి జగన్ అని
చురకలంటించారు. ఆర్థిక నేరాలు చేసినట్లు ఆధారాలు ఉన్నా.. జగన్ రెడ్డి బయటే
ఉన్నారన్నారు. సీబీఐ కూడా ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉందన్నారు. బీజేపీ ,
వైసీపీ పేరు మాత్రమే మార్పు. రెండు పార్టీలూ ఒక్కటేనని, ఏపీకి, తెలంగాణకు
ప్రధాన శత్రువు బీజేపీయేనని నారాయణ అన్నారు. విభజన చట్టం అమలు చేయకుండా
రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. అనుకూలంగా ఉంటే ఒక విధంగా,
వ్యతిరేకంగా ఉంటే మరో విధంగా జగన్ తీరు ఉందని, తెలంగాణ, ఎపీ ప్రభుత్వాలు
బీజేపీతోనే ఉన్నాయని, ఏపీలో టీడీపీ, జనసేనలు కూడా బీజేపీతోనే ఉండటం
దురదృష్టమన్నారు. వాళ్ల ఎజెండా ముఖ్యమంత్రి కావడం, తమ ఎజెండా ప్రజల సమస్యలు
పరిష్కారమని అన్నారు. మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతి ఆగిపోయిందన్నారు.
దగ్గుబాటి పురంధరేశ్వరి మంచి నాయకురాలే. అయినా బీజేపీలో ఉండి ఆమె ఏమీ చేయలేరని
నారాయణ అన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఆమె రాష్ట్రానికి ఏమి చేస్తారని
ప్రశ్నించారు. బీజేపీ కేంద్ర పెద్దలు జగన్‌తో కలిసి ఉంటారని.. పవన్‌తో పొత్తు
అంటారు.. మతోన్మాద బీజేపీకి ఎవరు మద్దతు ఇచ్చినా వాళ్లు తమకు రాజకీయ
ప్రత్యర్థులేనని అన్నారు. సీపీఐ చేపట్టిన బస్సు యాత్రకు మంచి స్పందన
వస్తోందని, తిరుపతిలో జిరిగే ముగింపు సభలో పాల్గొంటామని నారాయణ స్పష్టం చేశారు.