ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలోని సంఘటనలతో
‘వ్యూహం’, ‘శపథం’ చిత్రాలను
తెరకెక్కిస్తున్నట్లుగా రామ్ గోపాల్ వర్మ వెల్లడించిన సంగతి తెలిసిందే.
శనివారం ‘వ్యూహం’ టీజర్‌ను విడుదల చేశారు. ఆర్జీవీ డెన్, రామదూత క్రియేషన్స్
పతాకాలపై దాసరి కిరణకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం జరిగిన
పరిణామాలు, ఆ సమయంలో వైఎస్సార్ ఫ్యామిలీ ఎదుర్కొన్న సంఘర్షణ, ముఖ్యంగా
జగన్మోహన్ రెడ్డి ఆవేదన, ఆయన్ను అణచివేయాలని ప్రత్యర్థి పార్టీలు ఎలా కుట్ర
పన్నాయి? అనే అంశాలతో ఈ చిత్రం ఉంటుందన్నట్లు ‘వ్యూహం’ టీజర్లో చూపించారు రామ్
గోపాల్ వర్మ. అలాగే టీజర్ చివర్లో “అలా ఆలోచించడానికి చంద్రబాబుని కాదు’ అనే
డైలాగ్ కూడా ఉంది. 2009 నుంచి 2014 వరకూ వైఎస్ జగన్ జీవితంలో జరిగిన సంఘటనలతో
“వ్యూహం” ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో జగన్ పాత్రలో ఆజ్మల్
నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.