డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తోన్న లేటేస్ట్ చిత్రం శాకుంతలం. టాలీవుడ్
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో మలయాళీ నటుడు దేవ్
మోహన్, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాలో
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ బాలనటిగా కనిపించబోతుంది. ఈ
సినిమాతోనే అర్హ సినీరంగంలోకి అడుగుపెడుతుంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.
ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ క్యూరియాసిటిని పెంచేసింది. కాళిదాసు రచించిన
అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపొందిస్తోన్న ఈ చిత్రంలో శకుంతల పాత్రలో సమంత..
దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ కనిపించనున్నారు. ఏప్రిల్ 14న విడుదల కాబోతున్న
ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

ఈ క్రమంలో తాజాగా డైరెక్టర్ గుణశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు
చేశారు.శకుంతలం సినిమాలోని శకుంతల పాత్ర కోసం ముందుగా సమంతను అనుకోలేదని..
కానీ రంగస్థలం సినిమా చూశాకే ఈ పాత్ర కోసం సామ్ ను సంప్రదించినట్లు తెలిపారు.
గుణశేఖర్ మాట్లాడుతూ.. “ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకు సంవత్సర కాలం
పట్టింది. షూటింగ్ కోసం ఆరు నెలల సమయం అనుకున్నాం. కానీ 81 రోజులు పట్టింది. ఆ
తర్వాత ఏడాదిన్నర పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశాం. అలా ఈ సినిమాను
సిద్ధం చేయడానికి నాకు మూడేళ్లు పట్టింది.