బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
గుంటూరు : రాష్ట్రంలోని శక్తి కేంద్రాలను బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త
కృషి చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. ఆదివారం
జిల్లా కార్యాలయంలో గుంటూరు పశ్చిమ, తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య
నాయకులు, పోలింగ్ బూత్ స్వశక్తి కరణ్ అభియాన్ సమావేశం బిజెపి జిల్లా
అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు విచ్చేశారు. ఈసందర్భంగా బిజెపి
రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మాట్లాడుతూ శక్తి కేంద్రాల బలోపేతానికి
కృషిచేయాలని, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కార్యకర్తలకు 25
పనులు నిర్దేశించామన్నారు. బూత్ స్వశక్తి కరణ్ అభియాన్ కార్యక్రమంలో ఆయన
ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ 3 నుంచి 6 పోలింగ్ బూతులను కలిపి ఒక శక్తి
కేంద్రంగా గుర్తించాలని, ఆ కేంద్రానికి ఒక ప్రముఖ్ ను ఏర్పాటు చేయాలన్నారు.
రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ వ్యాప్తికి క్షేత్ర స్థాయి నుంచి కృషి
చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ఈనెలలో పాదయాత్రలు
నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వ
సహాయం ఎంతో ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయం దిశగా ప్రతి కార్యకర్త
కార్యదీక్షతో పనిచేయాలని కోరారు.
పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ బూత్ స్థాయి వరకు పార్టీ నీ బలోపేతం చేసుకోవటం
ముఖ్యమని, రాష్ట్ర ప్రభుత్వం వైపాల్యాలు బూత్ స్థాయి వరకు ప్రజలకు తెలియజేసి,
కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ విదంగా చేస్తుందో ప్రజలలోకి
తీసుకువెళ్లి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని
తెలియజేయాలని అన్నారు. జిల్లా అధ్యక్షులు రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ
సమావేశంలో బూత్ స్వశక్తి కరణ్ అభియాన్ జోనల్ ఇన్చార్జి పాలపాటి రవికుమార్
గుంటూరు పశ్చిమ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు తోట రామకృష్ణ,
శనక్కాయల ఉమాశంకర్ మాజీ మంత్రి శనక్కాయల అరుణ, జూపూడి రంగరాజు, యడ్లపాటి
స్వరూప రాణి, చందు సాంబశివరావు, కాయితి సైదారెడ్డి, భీమినేని చంద్రశేఖర్, ఆవుల
నాగేంద్ర యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శిలు, పదాధికారులు, మండల అధ్యక్షులు,
శక్తి కేంద్రాల ఇన్చార్జీలు తదితరులు పాల్గొన్నారు.