ఒకప్పుడు భారీ సినిమాల నిర్మాణానికి కేరాఫ్ అడ్రెస్ గా ‘వైజయంతీ మూవీస్’
బ్యానర్ కనిపించేది. ఆ బ్యానర్ నుంచి ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఆ
బ్యానర్ లో ఒక్క సినిమా అయినా చేయాలనే ఆశతో నటీనటులు ఉండేవారు. నిర్మాణ విలువల
పరంగా ఆ బ్యానర్ ఆ స్థాయిలో ఉండేది. అలాంటి బ్యానర్ పై ఇప్పటికీ సినిమాలు
వస్తూనే ఉన్నాయి.

తాజా ఇంటర్వ్యూలో అశ్వనీదత్ మాట్లాడుతూ .. “ఆ రోజుల్లో పంపిణీ అంతా కూడా
నిర్మాతలే చూసుకునేవారు. అందువలన నష్టం వస్తే దానిని నిర్మాతలు
తట్టుకోలేకపోయేవారు. చేసిన అప్పులు తీర్చడానికి ఇళ్లు .. పొలాలు
అమ్ముకున్నవారిని నేను చాలామందిని చూశాను. అలాంటివారిని చూసినప్పుడు నాకు భయం
వేసేది. మరింత జాగ్రత్తగా ఉండాలనిపించేది” అని అన్నారు.
“నేను కూడా నష్టాలను చూసినవాడినే. అయితే ఎన్టీఆర్ హీరోగా చేసిన ‘శక్తి’ సినిమా
విషయంలో బడ్జెట్ చేయిదాటిపోయింది. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు .. అందువలన 32
కోట్ల నష్టం వచ్చింది. ఒక సినిమా వలన 32 కోట్లను పోగొట్టుకోవడమనేది మామూలు
విషయం కాదు. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది” అంటూ
చెప్పుకొచ్చారు