విజయవాడ : శాంతి, దయ, కరుణ, ప్రేమ ప్రపంచానికి చాటి చెప్పిన ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ భావాన్ని, సేవాతత్పరతను బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు. లోక రక్షకుడుకైన ఏసుక్రీస్తు విశ్వమానవాళి శ్రేయస్సును కాంక్షించారని మల్లాది విష్ణు తెలిపారు. సహనం, క్షమాగుణాలు ఎంత గొప్పవో చాటేందుకు ఆ కరుణామయుడు తన రక్తం చిందించారన్నారు, ప్రపంచానికి శాంతి మార్గం చూపారన్నారు. ప్రతిఒక్కరూ సహనం, ప్రేమ కలిగి ఉండాలని, నిస్సహాయులపై కరుణ చూపాలని శతాబ్దాల క్రితమే క్రీస్తు ప్రబోధించారని గుర్తుచేశారు. ఈ పర్వదినాన్ని నియోజకవర్గ ప్రజలందరూ ఆనందోత్సాహాలతో వేడుకగా జరుపుకోవాలని మల్లాది విష్ణు ఆకాంక్షించారు. క్రిస్మస్ స్ఫూర్తి మన హృదయాలను ప్రేమ, కరుణతో నింపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలందరిపై జీసస్ కరుణ ఉండాలని, ప్రభువు కృపతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మరింత పురోభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కాంక్షించారు.