కుటుంబ సభ్యుల సంబరాలు వైరల్
శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి టీ20లో ఫాస్ట్ బౌలర్ శివమ్ మావికి అంతర్జాతీయ
క్రికెట్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. చాలా కాలంగా ఈ అవకాశం కోసం
ఎదురుచూస్తున్న శివమ్ మావి వచ్చిన ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకున్నాడు. తన
మొదటి మ్యాచ్‌లోనే అద్భుతమైన విజయాన్ని అందించి చిరస్మరణీయంగా మలిచాడు. అయితే
శివన్ మావి ఇచ్చిన విజయతో అతడి కుటుంబం తమ ఇంట్లో టీవీ ముందు ఆనందోత్సాహాలు
జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.