వేసవి తర్వాత నేల ఉడుతలు(స్క్విరెల్స్) తమ శీతాకాలపు నిద్రాణస్థితికి
ఆహారాన్ని నిల్వ చేయడం ప్రారంభిస్తాయి. సుదీర్ఘ శీతాకాలపు నెలల్లో అవి
నిద్రాణస్థితి బొరియల్లో జీవించడానికి వీలుగా కొవ్వుగా పెద్ద మొత్తంలో శక్తిని
నిల్వ చేస్తాయి. నేల ఉడుతలు నిద్రాణస్థితిలో ఉన్నప్పుడు టార్పోర్ స్థితికి
వెళతాయి. వాటి జీవక్రియ రేటు వేసవికాల స్థాయిలో ఒక శాతానికి పడిపోతుంది. వాటి
ప్రధాన శరీర ఉష్ణోగ్రత గడ్డకట్టే స్థాయికి పడిపోతుంది. వసంతకాలం వరకు
టార్పోర్లోకి వెళ్లడం ద్వారా శక్తిని అవి ఆదా చేస్తాయి. అలాగే శరీర కణజాలాలు,
అవయవాలు స్థిరమైన ప్రోటీన్ సరఫరా లేకుండా నిర్వహించబడవు. అయితే, ఇది
సుదీర్ఘమైన ఉపవాస సమయంలో అందుబాటులో ఉండదు. ముఖ్యంగా కండరాలు సమస్యకు
గురవుతాయి. అలాంటప్పుడు కొవ్వును కరిగించి వాటి నిర్వహణకు శరీరం
ఉపయోగించుకుంటుంది.