హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌పై బుధవారం తొలి వన్డేలో టీమిండియా
యువ ఆటగాడు శుభ్‌మాన్ గిల్ డబుల్ సెంచరీతో మెరుపులు మెరిపించాడు. 149 బంతులలో
9 భారీ సిక్సర్లు, 19 ఫోర్లతో శుభ్‌మన్ గిల్ మొత్తం 208 పరుగులు చేశాడు. దీంతో
వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన 10వ బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లో
నిలిచాడు. అలాగే టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన 5వ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
వన్డే ఇంటర్నేషనల్స్‌లో డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన భారత
క్రికెటర్‌గా శుభమాన్ గిల్ రికార్డు సృష్టించాడు. గతంలో సచిన్ టెండూల్కర్,
వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఈ ఫీట్ సాధించారు. వన్డేల్లో
డబుల్ సెంచరీ కొట్టిన అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా కూడా అతను రికార్డు
సృష్టించాడు – ఇది గతంలో కిషన్ పేరిట ఉండేది. కేవలం 23 ఏళ్ల 132 రోజుల వయసులో
ఈ అద్భుతాన్ని చేశాడు. గత నెలలో 24 ఏళ్ల 145 రోజుల వయసులో ఈ రికార్డును
నెలకొల్పిన ఇషాన్ కిషన్ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాకుండా కోహ్లీ,
శిఖర్ ధావన్ వంటి వారిని అధిగమించి వేగంగా 1000 వన్డే పరుగులు చేసిన భారతీయ
క్రికెటర్ అయ్యాడు.