మంత్రి కుమారుడు రాజ్యాంగేతర శక్తిగా మారారు
రామచంద్రాపురం వైసీపీలో వర్గ పోరు
మంత్రి వేణుగోపాలకృష్ణపై బోస్ వర్గం తిరుగుబాటు
వచ్చే ఎన్నికల్లో పిల్లి సూర్యప్రకాశ్‌కు వైసీపీ టికెట్ ఇవ్వాలి
మంత్రిపై బోస్ వర్గం తిరుగుబావుటా
చెల్లుబోయిన వర్సెస్ పిల్లి.. వైసీపీలో డిష్యుం డిష్యుం
రామచంద్రాపురం : కోనసీమ జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి.
రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ ఎంపీ
పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వచ్చే
ఎన్నికల్లో రామచంద్రపురం సీటును తన కుమారుడికి ఇప్పించేలా ఎంపీ సుభాష్
చంద్రబోస్ ప్రయత్నిస్తుండగా తన సీటు వదులుకునేందుకు మంత్రి వేణుగోపాలకృష్ణ
సుముఖంగా కనిపించడం లేదు. దీంతో జిల్లాలో ఈ ఇద్దరు అధికార పార్టీ నేతలు
ఆధిపత్యం కోసం పోరాడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే రామచంద్రపురంలో తనకు
వ్యతిరేకంగా ఏమీ జరగడం లేదని మంత్రి వేణు క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో
రామచంద్రపురం నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. కోనసీమ
జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. రామచంద్రపురం
నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్
చంద్రబోస్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వచ్చే ఎన్నికల్లో
రామచంద్రపురం సీటును తన కుమారుడికి ఇప్పించేలా ఎంపీ సుభాష్ చంద్రబోస్
ప్రయత్నిస్తుండగా.. తన సీటు వదులుకునేందుకు మంత్రి వేణుగోపాలకృష్ణ సుముఖంగా
కనిపించడం లేదు. దీంతో జిల్లాలో ఈ ఇద్దరు అధికార పార్టీ నేతలు ఆధిపత్యం కోసం
పోరాడుతున్నట్లు కనిపిస్తోంది.
మంత్రి వేణు గోపాలకృష్ణపై సొంతనియోజకవర్గంలోనే తిరుగుబాటు ఎదురైంది. రానున్న
ఎన్నికల్లో వేణుకు కాకుండా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడికి టికెట్
ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం
నియోజకవర్గంలోని వైసీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. మంత్రి
వేణుగోపాలకృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయుల మధ్య పచ్చగడ్డి
వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. మంత్రిపై బోస్ వర్గం తిరుగుబావుటా
ఎగరవేసింది. ఆదివారం వెంకటయ్య పాలెంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్
వర్గీయులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చంద్రబోస్‌పై అభిమానంతో మంత్రి వేణును
గెలిపించామని, అలాంటిది తమ మీదే రౌడీషీట్ తెరిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం
చేశారు. మంత్రి కుమారుడు రాజ్యాంగేతర శక్తిగా మారారని, వైసీపీని మంత్రి నాశనం
చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శెట్టిబలిజలను మంత్రి వేణుగోపాలకృష్ణ
అణగదొక్కేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈసారి ఆయనకు టికెట్ ఇస్తే కచ్చితంగా
ఓడిస్తామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబోస్ కుటుంబానికి టికెట్
ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ టికెట్ ఇవ్వకపోయినా, బోస్ కుమారుడిని
గెలిపిస్తామని ఆయన అభిమానులు స్పష్టం చేశారు. రూ.12 కోట్లు ఖర్చు పెట్టానని,
డబ్బులిస్తేనే పనులు చేస్తానని మంత్రి చెబుతున్నారని మండిపడ్డారు. ఈ నెల 26న
అమలాపురంలో సీఎంను కలిసి పరిస్థితులు వివరిస్తామని చంద్రబోస్ అనుచరులు
తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పిల్లి సూర్యప్రకాశ్‌కు వైసీపీ టికెట్ ఇవ్వాలని
డిమాండ్ చేశారు.
అధిష్టానంపై అలక : కాగా వైసీపీ అధిష్టానంపై రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్
చంద్రబోస్ అలక వహించారంటూ ఇటీవల తీవ్రస్థాయిలో ప్రచారం జరిగింది. 2012లో
మంత్రి పదవి వదులుకొని జగన్ వెంట పిల్లి సుభాష్ నడిచారు. కానీ అప్పట్లో జరిగిన
ఉప ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. తరువాత రెండు ఎన్నికల్లోనూ ఓటమి
తప్పలేదు. ప్రస్తుతం చేతిలో రాజ్యసభ పదవి ఉన్నా ఎందుకీ పనికి రాకుండాపోయిందని
బోస్ అంతర్గతంగా రగిలిపోతున్నారు. వైసీపీ హైకమాండ్ సైతం తన గోడు
పట్టించుకోకపోవడంతో రగిలిపోతున్నారు. మరోవైపు వైసీపీలో తమ వారిని మంత్రి
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ టార్గెట్ చేస్తున్నారని ఎంపీ పిల్లి సుభాష్ వర్గం
ఆరోపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పిల్లి సూర్యప్రకాష్ రాజకీయ అరంగేట్రం
చేస్తున్నారని, రామచంద్రపురం వైసీపీ అభ్యర్థిగా పలు గ్రామాల్లో సూర్యప్రకాష్
పర్యటిస్తారని పిల్లి సుభాష్ అనుచరులు స్పష్టం చేస్తున్నారు. నియోజక వర్గంలో
నెలకొన్న పరిస్థితుల్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం ఉండటం
లేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం పిల్లి సుభాష్ అనుచరులు ఏర్పాటు
చేసిన సమావేశం స్థానికంగా వైసీపీ వర్గాల్లో కలకలం రేపింది. అటు ఎంపీ పిల్లి
సుభాష్‌కు మంత్రి చెల్లుబోయిన వేణు శిష్యుడు అని, వాళ్లిద్దరి మధ్య విభేదాలు
ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొందరు వైసీపీ నేతలు
అంటున్నారు. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ కోనసీమ జిల్లాలో పిల్లి
వర్సెస్ చెల్లుబోయిన వర్గాల రాజకీయాలు వైసీపీలో ప్రస్తుతం హాట్ టాపిక్
అవుతున్నాయి.