ఉత్తరాంధ్ర వైసీపీ కన్వీనర్ వై వి సుబ్బారెడ్డిని కోరిన రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య
విశాఖపట్నం : శ్రీకాకుళం ఎంపీ టికెట్ కళింగ సామాజిక వర్గానికి కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య కోరారు. ఈ మేరకు ఉత్తరాంధ్ర వైసీపీ కన్వీనర్ వై వి సుబ్బారెడ్డిని కలిసి ఒక వినతి పత్రాన్ని అందించారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా సోమవారం పలు బీసీ సంఘాలు కుల సంఘాలతో సమావేశాలు నిర్వహించారు. వైయస్ జగన్ గెలుపుతోనే బీసీల గెలుపు ముడిపడి ఉందని తెలిపారు. నవరత్నాల పథకాలు ద్వారా రెండు లక్షల కోట్లు పైగా సంక్షేమ పథకాల రూపంలో ఎటువంటి అవినీతి లేకుండా నేరుగా అర్హులైన పేద ప్రజలకు అందించిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శ్రీకాకుళం ఎంపీ టికెట్ కళింగ సామాజిక వర్గానికి చెందిన కేటాయించాలని కోరారు. దుంపల వెంకట రవి కిరణ్ అభ్యర్థిత్వానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మద్దతు పలుకు తున్నాయని, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్న యువత పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారన్నారు. శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ప్రజల జీవన స్థితిగతులు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి దుంపల వెంకట రవి కిరణ్ అని తెలిపారు. ఉన్నత విద్యావంతుడు, సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి డాక్టరు వృత్తిలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకొని ముఖ్యంగా ఉద్దానం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి సమస్యను పరిష్కరించడంలో కీలక భూమి పోషించిన వ్యక్తి కాబట్టి శ్రీకాకుళం ఎంపీ టికెట్ అభ్యర్థి వారికి దుంపల వెంకట రవి కిరణ్ పరిశీలించాలని కోరారు.