శ్రీకాకుళం : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ
కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 3 పట్టభధ్రుల, 2 ఉపాధ్యాయుల, 4 స్థానిక సంస్థల
ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే
తిరుపతిలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో మార్చి 15న రీపోలింగ్ నిర్వహించారు.
ఇక, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు ఉదయం 8
గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ విషయంలో అధికారులు అన్నిరకాల జాగ్రత్తలు
తీసుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియలో ముందుగా బ్యాలెట్ పేపర్లను పరిశీలించారు.
ముందుగానే చెల్లని ఓట్లను పక్కకు పెట్టేశారు. శ్రీకాకుళం స్థానిక సంస్థల
ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. ఇందుకు సంబంధించిన వివరాలను
అధికారులు విడుదల చేశారు. వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు విజయం సాధించట్టుగా
తెలిపారు. మొత్తం 752 ఓట్లు పోలవ్వగా నర్తు రామారావుకు 632 ఓట్లు, స్వతంత్ర
అభ్యర్థికి 108 ఓట్లు వచ్చాయి. 12 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు.