తిరుమల : తిరుమల శ్రీవారిని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా
దర్శించుకున్నారు. శనివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో జెపి
నడ్డా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనాంతరం
రంగనాయకుల మండపంలో వేదపండితులు నడ్డాకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు
శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నడ్డాతో పాటు
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర బిజేపీ అధ్యక్షుడు
సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరశింహరావు, కేంద్ర మాజీ మంత్రి
సుజనా చౌదరి, ఎంపి సిఎం రమేష్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్
రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు, భాను ప్రకాష్ రెడ్డి ఉన్నారు. ఆలయం
వెలుపల మీడియాతో నడ్డా మాట్లాడుతూ శ్రీ వెంటేశ్వరుడంటే ప్రపంచ వ్యాప్తంగా
ఉన్న ప్రజలకు అపారమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయన్నారు. దేశంలో శాంతి., సంపూర్ణ
అభివృద్ది సాధించేలా భగవంతుడు శక్తిని ఇవ్వాలని ప్రార్ధించానని తెలిపారు.
ప్రజలంతా స్వామి వారి ఆశీస్సులతో చల్లగా ఉండాలని స్వామి వారిని
వేడుకున్నానన్నారు. భారత దేశం అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందేలా
దీవించాలని ప్రార్ధించినట్లు చెప్పారు.