విజయవాడ పశ్చిమ : విజయవాడ నగరంలో ని శ్రీ మాతృ మండలి వ్యవస్థాపకురాలు శ్రీమతి
కోడూరి సుందరి బృందం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం సి వి ఆర్ ప్లై ఓవర్
బ్రిడ్జి పక్కనున్న శ్రీ దేవి కరుమారి అమ్మన్ అమ్మవారికి ఆషాడం సారె
సమర్పించారు. శ్రీ దేవీ కరుమారి అమ్మన్ శక్తి పీఠంలో తొలిసారిగా శ్రీ మాతృ
మండలి వ్యవస్థాపకురాలు కోడూరి సుందరి బృందం వందలాది మంది మహిళలు ఈ
కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత శక్తీ పీఠం సంప్రదాయం ప్రకారం మహిళా
బృందాలకు ఆలయం తరుపున పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కరుణ దాసు,పూజారులు ఈ మహిళా
బృందాలకు మేళతాలాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆ తరువాత అమ్మవారికి సారె
సమర్పించారు. గత కొన్ని రోజులుగా అమ్మవారి ఆలయంలో వారాహి పూజలు,హోమాలు
జరిగుతున్నాయి.అమ్మవారు వారాహి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ
కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు,జ్ఞానేశ్వర్, అర్చకులు దీక్షితులు,
ప్రముఖ ఆధ్యాత్మకులు యాబలూరి లోకనాధ్ శర్మ కొడుకు కోడలు రాఘవరావుశర్మ ,జయంతి,
సంఘ సేవకులు బండారు నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.