సౌదీ అరేబియాలో జరిగిన రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో బాలీవుడ్ హీరో
రణ్బీర్ కపూర్ తాజాగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రణ్బీర్
తన సినిమాల గురించి పంచుకున్నాడు.’షంషేరా’ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతూ..
‘షంషేరా చాలా కష్టతరమైన చిత్రం. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్. కానీ
నేను గడ్డంతో నటించడమే పెద్ద పొరపాటు. చాలా వేడిలో షూటింగ్ చేశాం. ఆ సమయంలో
గడ్డం ఉండడంతో వేడికి ముఖం కరిగిపోతుందేమోనని అనిపించింది’ అని
చెప్పుకొచ్చాడు. తనే స్వయంగా నిర్మించి నటించిన చిత్రం ‘జగ్గ జసూస్’ గురించి
కూడా రణ్బీర్ స్పందించాడు. ‘జగ్గా జసూస్, నేను నిర్మించిన చిత్రం. ఎంతో నచ్చి
ఆ సినిమా చేశాను. దానికి అనురాగ్ బసు దర్శకత్వం వహించారు. ఆ సినిమా కానెప్ట్
హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. మంచి ఐడియా కూడా. కానీ అది బాగా ఆడలేదు. ఆ
సినిమా ఫెయిల్యూర్ నన్ను చాలా బాధించింది. నా కెరీర్లోనే నన్నెంతో బాధించిన
సినిమా అదే’ అని రణ్బీర్ తెలిపాడు.