కడప : ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రధాని కావాలన్న కోరిక కోసమే షర్మిల కాంగ్రెస్‌లో చేరారని ఇది రాజశేఖర్‌రెడ్డి కల అని కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి తెలిపారు. శనివారం కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ షర్మిల రాకతో ఏపీలో కాంగ్రెస్ మళ్లీపురుడు పోసుకుంటుందని చెప్పారు. మాజీ నేతలంతా తన వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రం హక్కులు సాధించడంలో షర్మిల పాత్ర కీలకం కావాలని సూచించారు. ఎర్రకోటలో కాంగ్రెస్ జెండా ఎగరాలని ఆవిధంగా అందరం కృషి చేస్తామన్నారు. మాజీ మంత్రి అహ్మదుల్లా కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. అహ్మదుల్లా కుటుంబం గతంలో చాలా భాద్యతలు తీసుకు ని కాంగ్రెస్ కోసం కష్టపడ్డారని రఘువీరారెడ్డి పేర్కొన్నారు.