చైనాలోని, షాంఘైలో ఉన్న నిండిన ప్రధాన ఆసుపత్రి బెడ్లు
కోవిడ్ బాధితులకు హాల్లోనే చికిత్సలు
బీజింగ్ : చైనాలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. లక్షల మందికి సోకుతూ
వేగంగా విస్తరిస్తోంది. జీరో కోవిడ్ పాలసీని ఎత్తివేసిన క్రమంలో పరిస్థితులు
దారుణంగా మారాయి. వైరస్ బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య
ఒక్కసారిగా పెరిగింది. దగ్గు, దమ్ము, శ్వాసకోస సంబంధిత సమస్యలతో వయోవృద్ధులు
ఆసుపత్రులకు పరుగులుపెడుతున్నారు. బెడ్లు సరిపోకపోవడంతో హాలులోనే నెలపైనే
చికిత్స అందిస్తున్న దృశ్యాలు వైరల్గా మారాయి. చైనాలోని ప్రధాన నగరం
షాంఘైలోని రెండు ప్రధాన ఆసుపత్రుల్లో రోగుల పరిస్థితులు దయనీయంగా
కనిపిస్తున్నాయి. బెడ్లు నిండిపోవడంతో కోవిడ్ బాధితులకు హాల్లోనే చికిత్సలు
అందిస్తున్నారు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు పడుతూ హార్ట్ మానిటర్స్,
ఆక్సిజన్ ట్యాకులతో ఉన్న రోగుల దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారాయి.