బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుక్ ఖాన్ అమెరికాలోని లాస్ ఏంజెలిస్ లో జరిగిన ఒక
ప్రమాదంలో గాయపడ్డారు. ఓ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా షారుక్ ప్రమాదానికి
గురయ్యారు. ముక్కుకి బలమైన గాయాలు కావడంతో, అక్కడే చిన్నపాటి శస్త్రచికిత్స
కూడా చేయించుకున్నారు. ముంబయిలో ఉన్న తన ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నట్టు
ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. ‘రక్తస్రావాన్ని ఆపేందుకు ముక్కుకి చిన్న
శస్త్రచికిత్స చేశాం. ఇందులో పెద్దగా ఆందోళన పడాల్సిన విషయ మేమీ లేదు’ అంటూ
వైద్యులు షారుక్ బృందానికి తెలియజేసినట్టు సమాచారం. అయితే ఈ ప్రమాదం ఎప్పుడు?
ఏ సినిమా చిత్రీకరణ సమయంలో చోటు చేసుకుందనే విషయాలు వెల్లడించలేదు. షారుక్
త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమాల ద్వారా సందేశాలు పంపుతున్నారు అభిమానులు.
ప్రస్తుతం షారుక్.. ఆట్లీ దర్శకత్వంలో ‘జవాన్’లో నటిస్తు న్నారు. ఈ చిత్రం
సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.