టాలీవుడ్ అందాల భామ, హీరోయిన్ సమంత వరుస షూటింగ్ లతో మళ్లీ మునుపటి జోరును
కొనసాగిస్తున్నారు. ఇటీవలే మయోసైటిస్ నుంచి కోలుకున్న ఆమె.. టాలీవుడ్ తో పాటు
బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం సిటాడెల్ వెబ్
సిరీస్ షూటింగ్లో ఉన్నారు. ఈ క్రమంలో పలు యాక్షన్ సీక్వెల్స్ చేస్తుండగా సమంత
చేతికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఇన్ స్టాగ్రామ్ ద్వారా
వెల్లడించారు. తన చేతులకు గాయాలైన ఫోటోను షేర్ చేసి.. యాక్షన్ ఫలితం అంటూ
కామెంట్ పెట్టారు. ఇక సిటాడెల్ అనే వెబ్‌సిరీస్‌లో బాలీవుడ్ నటుడు వరుణ్
ధావన్, సమంత కలిసి నటిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్, డికే ఈ
సిరీస్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో సమంత పలు యాక్షన్ సన్నివేశాల్లో
నటించాల్సి ఉంది. దీని కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ దగ్గర ప్రత్యేకంగా
ట్రెనింగ్ కూడా తీసుకున్నారు. అనంతరం షూటింగ్లో పాల్గొన్న సమంత చేతులకు
స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఆమె నటించిన శాకుంతలం చిత్రం ఏప్రిల్ 14న విడుదల కావాల్సి ఉండగా..
ఫిబ్రవరి 17న విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ అనివార్య కారణాల వల్ల సినిమా
మరోసారి వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని బట్టి తెలుగు, హిందీ, తమిళ
భాషల్లో సినిమా విడుదల కానుంది. ఇది కాకుండా సమంత తదుపరి రొమాంటిక్ చిత్రం
ఖుషిలో నటుడు విజయ్ దేవరకొండ సరసన, యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సిటాడెల్లో
వరుణ్ ధావన్‌తో కలిసి నటించనున్నారు.