విశాఖపట్నం : సంక్రాంతి మామూళ్ల కోసం దత్త తండ్రి ఇంటికి దత్తు పుత్రుడు
వెళ్లాడని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో
మాట్లాడుతూ చంద్రబాబు వేసే ఎంగిలి మెతుకు సీట్లతో మ్యాజిగ్ ఫిగర్ ఎలా
చేరుకుంటారని ప్రశ్నించారు. అమాయకపు జనసేన కార్యకర్తలను పవన్ అమ్మకానికి
పెట్టాడని అమర్నాథ్ దుయ్యబట్టారు.