200 మందికి పోత్సహకాలను అందజేసిన వైసీపీ రాష్ట్ర నాయకులు మాదాసు.
కలువాయి ఎక్స్ ప్రెస్ న్యూస్
సంక్రాంతి పండుగ ను పురస్కరించుకొని కలువాయి మండలం రాజుపాలెం లో వైసీపీ రాష్ట్ర నాయకులు మాదాసు గంగాధరం భార్య నలినమ్మ మహిళలకు ముగ్గుల పోటీలు ఎర్పాటు చేశారు. ఈ సందర్బంగా పోటిల్లో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సహకాలను అందజేశారు.మొదటి రోజు రాజుపాలెం లో వైసీపీ రాష్ట్ర నాయకులు మాదాసు గంగాధరం భార్య నలినమ్మ మహిళలకు ముగ్గుల పోటీలు ఎర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ ను పురస్కరించుకొని ఆమె కుల్లూరు పంచాయతీ లోని రాజుపాలెం ఈ పోటీలను నిర్వహించారు.కార్యక్రమం లో 200 మంది మహిళలు పాల్గొన్నారు. పోటిల్లో పాల్గొన్న మహిళకు ప్రోత్సహకాలను వైసీపీ రాష్ట్ర నాయకులు మాదాసు గంగాధరం చేతుల మీదుగా అందజేశారు. ఈ ఈసందర్బంగా నలినమ్మ మాట్లాడుతూ…పల్లెల్లో రంగవల్లు అంతరించి పోకుండా ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 10న రాజుపాలెం,11 వెంకట రెడ్డి పల్లి,12 కుల్లూరు గ్రామాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. చివరి రోజున కుల్లూరు లో జిల్లా జాయింట్ కలెక్టర్ కుర్మా నాద్ దంపతులు, జిల్లా అటవీ శాఖ అధికారి చంద్రశేఖర్ చేతులు మీదుగా ప్రధమ, ద్వితీయ, తృ తీ య బహుమతులను అందజేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమం లో వైసీపీ రాష్ట్ర నాయకులు మాదాసు గంగాధరం, గ్రామ సర్పంచ్ అంకయ్య, ఉప సర్పంచ్ శ్రీనివాసులు, నాయకులు పోతల సుబ్బారాయిడు, మహిళ లు పాల్గొన్నారు.
………………….
ఫోటో రైటప్ మహిళలకు ప్రోత్సహక బహుమతులను అందజేస్తున్న వైసీపీ రాష్ట్ర నాయకులు మాదాసు గంగాధరం, మాదాసు నలినమ్మ.