సారవకోట : ప్రజా సంక్షేమమే ఊపిరిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి జనరంజక
పాలనని అందిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన
శుక్రవారం సారవకోట మండలం అలుదు పంచాయతీ వడ్డినవలసలో గడప గడపకు మన ప్రభుత్వం
కార్యక్రమంలో పార్టీ సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలకన్నా ఎంతో భిన్నంగా పేదప్రజల
జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా సీఎం జగన్ కృషి చేస్తున్నారని అన్నారు..
తాను చెప్పిన ప్రతి మాటనీ ఆచరిస్తూ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు
నుంచే నేటివరకూ ఎన్ని సవాళ్లు ఎదురైనా సాహసంతో అధిగమిస్తూ ముందుకు
సాగుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరిలో జీవితంపై మనోధైర్యాన్ని పెంచిన జగన్
మానవత్వం ఉన్న రాజకీయ నాయకుడని అన్నారు. పేదలకు ఎలాంటి పథకాలు. అవసరమో వాటిని
మాత్రమే అమలుచేస్తూ రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ ఒక మార్గ నిర్దేశకునిలా
నిలుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వరుదు వంశీకృష్ణ, దేవిశ్రీప్రసాద్,
ఎంపీటీసీ రావాడ శ్రీనివాసరావు, సర్పంచ్ సాగిపల్లి దండాసి, తలాడ రాము, వడినవలస
నాయకులు, మండల నాయకులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు. అనంతరం జలుమూరు,
సారవకోట మండల కేంద్రంలలో నిర్వహించిన సచివాలయ కన్వీనర్ల సదస్సులో మాట్లాడారు.
ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేర్చడంలో కన్వీనర్లు సహాయ పడగలరని
కోరారు.