రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి
సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు చేర వేస్తున్నాం
కరోనా సంక్షోభం సమయంలో వైద్యం తో పాటు సంక్షేమ పథకాలను అందించిన ఘనత
ముఖ్యమంత్రిదే
రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి
పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
కుప్పం : ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి
అందిస్తున్న సంక్షేమ పథకాలను కుప్పం నియోజకవర్గంలోని ప్రతి గడప కు చేర
వేస్తామని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల
శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం కుప్పం రూరల్
మండలంలో పల్లెబాట కార్యక్రమంలో భాగంగా నడిమూరు, మల్లనూరు లలో ఒక్కొక్కటి రూ.
25.00 లక్షలతో, మల్లనూరు -2, మంగళదొడ్డి నందు ఒక్కొక్కటి రూ.40.00 లక్షల అంచనా
వ్యయంతో గ్రామ సచివాలయ భవనాలను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి
తో పాటు చిత్తూరు ఎంపి ఎన్.రెడ్డెప్ప, ఎం ఎల్ సి లు భరత్,
సిపాయిసుబ్రహ్మణ్యం,టిటిడి బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, రెస్కొ ఛైర్మన్
సెంధిల్ కుమార్, కుప్పం మున్సిపల్ ఛైర్మన్ డా. సుధీర్ రెడ్డి, రాష్ట్ర వన్యకుల
క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వనిత,జెడ్ పి సి ఈ ఓ ప్రభాకర్ రెడ్డి, ఎంపిపి
అశ్విని, మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు తది తరులుపాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలలో మంత్రి మాట్లాడుతూ కుప్పం
నియోజకవర్గంలోని ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి వచ్చి సంక్షేమ పథకాలను అందించడం
జరుగుతుందని, సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హులందరికీ సంక్షేమ పథకాలు
చేరవేస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలో దాదాపు రెండు సంవత్సరాలు మన
రాష్ట్రంతో పాటు ప్రపంచం సంక్షోభంలో ఉన్నప్పుడు అవసరమైన మందులు, టీకాలను,
వైద్య సదుపాయాలను రాష్ట్ర ప్రజలకు అందించడంతో పాటు, సంక్షేమ క్యాలెండర్ లో
తెలిపిన ప్రకారం అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా వంటి పథకాలను క్రమం తప్పకుండా
అందించి పేదలు ఆర్థికంగా నిలదొక్కుకోనేలా చేసిన ఘనత ముఖ్యమంత్రిదేనని
తెలిపారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా పేదరికం అర్హతగా పెన్షన్లు, పేదలందరికీ
ఇల్లు వంటి పథకాలను అందిస్తూ 99 శాతం ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి
నెరవేర్చారని తెలిపారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో ఇల్లులేని నిరుపేద
ఉండకూడదని, పక్కా గృహాలను నిర్మించడంలో భాగంగా దాదాపు 31.50 లక్షల ఇళ్ల
పట్టాలను మహిళల పేరుతో ఇవ్వడంతో పాటు దాదాపు 24 లక్షల ఇళ్ళు మంజూరు చేసు
కున్నామని, అందు లో 6 లక్షల ఇళ్ళు పూర్తి చేసు కున్నా మన్నారు. విద్యకు అధిక
ప్రాధాన్యత ఇస్తూ నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వపాఠశాలలలో అవసరమైన
తరగతి గదులు, లైట్ లు, బెంచ్ లు, మరుగుదొడ్లు వంటి పూర్తి మౌలిక సదుపాయాలు
అందించడంతో పాటు కార్పొరేట్ స్కూల్ లకు ధీటుగా 3వ తరగతి నుండే ప్రభుత్వ
పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అందించి బాహ్య ప్రపంచంలో పోటీని తట్టుకుని నిలబడలేలా
తీర్చిదిద్దడం జరుగుతున్నదన్నారు. జగనన్న గోరుముద్ద ద్వారా విద్యార్థులకు
పౌష్టికాహారం అందించడం జరుగుతున్నదన్నారు. పేదలకు కార్పొరేట్ వైద్యం దూరం
కాకూడదనే ఉద్దేశ్యంతో ఆరోగ్య శ్రీ ద్వారా ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రులలో
పూర్తి ఉచితంగా వైద్యం అందించడం జరుగుతున్నదని, రాష్ట్రం లో ప్రతి జిల్లాకు ఒక
మెడికల్ కళాశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీకారం చూట్టారని, ప్రస్తుతం ఉన్న
ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న డాక్టర్ లు, పారా మెడికల్ పోస్ట్ లను భర్తీ
చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి సచివాలయ,
వాలంటీర్ వ్యవస్థ ద్వారా దాదాపు 4 లక్షల ఉద్యోగాలను కల్పించడం జరిగిందన్నారు.