వరుసగా మూడవ ఏడాది వైఎస్సార్ ఆసరా
సీఎం జగన్ వైఎస్సార్ ఆసరా సభలో వెల్లువెత్తిన అక్కాచెల్లెళ్ళమ్మలు
అక్కచెల్లెమ్మలు అండగా జగన్ అన్న ప్రభుత్వం
చంద్రబాబు వల్ల దెబ్బతిన్న పొదుపు సంఘాలకు… మేనిఫెస్టోలో ఇచ్చిన మాట మేము
నెరవేర్చాము: సీఎం జగన్
‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా మూడో విడత రూ.6,419.89 కోట్ల ఆర్థిక సాయాన్ని
నేటి నుండి ఏప్రిల్ 5 వరకు 10 రోజుల పాటు పండగ వాతావరణంలో 7,98,395 స్వయం
సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసే
కార్యక్రమాన్నీ ఏలూరు జిల్లా దెందులూరులో సీఎం వై.ఎస్. జగన్ ప్రారంభించారు.
నేడు అందిస్తున్న రూ. 6,419.89 కోట్లతో కలిపి వైఎస్సార్ ఆసరా కింద ఇప్పటివరకు
సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 19,178 కోట్లు అని సీఎం
వై.ఎస్. జగన్.
చంద్రబాబు వల్ల దెబ్బతిన్న పొదుపు సంఘాలకు… మేనిఫెస్టోలో ఇచ్చిన మాట మేము
నెరవేర్చాము
గత ప్రభుత్వ రుణాలు కట్టొద్దు పొదుపు సంఘాల తరపున మేమే చెల్లిస్తామని 2014లో
హామీ ఇచ్చి ఎగ్గొట్టిన కారణంగా.. రాష్ట్రవ్యాప్తంగా చితికిపోయిన దాదాపు 7.98
లక్షల స్వయం సహాయక సంఘాల్లోని సుమారు 78.94 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు
ఊరటనిస్తూ.. 2019 ఎన్నికల నాటికి SLBC తుది జాబితా ప్రకారం ఉన్న రూ. 25,571
కోట్ల రుణాన్ని తామే చెల్లిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ,
ఇప్పటికే 2 విడతల్లో రూ. 12,758 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించామని సీఎం జగన్
తెలిపారు.
కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులతో అనుసంధానం చేసి ప్రభుత్వం అందించిన సహకారంతో
ఇప్పటి వరకు 9,86,616 మంది అక్కచెల్లెమ్మలు కిరాణా దుకాణాలు, ఆవులు, గేదెలు,
గొర్రెలు, మేకల పెంపకం, వస్త్ర వ్యాపారం తదితర వ్యాపారాలు చేపట్టి నెలకు రూ.
7,000 నుండి రూ. 10,000ల వరకు అదనపు ఆదాయం పొందుతున్నారని, అలానే అమూల్ తో
ఒప్పందం కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి లీటర్ పాలపై రూ.5 నుండి రూ.15 వరకు
అదనపు ఆదాయం సంపాదిస్తున్నారని సీఎం జగన్ అన్నారు.
సంక్షేమ పథకాలలో లంచాలు లేవు, వివక్ష లేదు
దేశానికి రోల్‌మోడల్‌గా ఏపీ పొందుపు సంఘాలు
దేశానికి రోల్‌మోడల్‌గా ఏపీ పొందుపు సంఘాలు నిలుస్తున్నాయని.. బ్యాంకులతో
మాట్లాడి వడ్డీ శాతాలను తగ్గించాం అని సీఎం జగన్ అన్నారు. ఇంకా తగ్గించేలా
బ్యాంకర్లమీద ఒత్తిడి తీసుకువస్తున్నామని తెలిపారు సీఎం జగన్.
మహిళ వివక్ష పై పోరాటం
మహిళ వివక్షమీద పోరాటం చేస్తోంది ఈప్రభుత్వం. కోట్లమంది అక్కచెల్లెమ్మలు..
రక్షా బంధనం కట్టిన ప్రభుత్వం మనది. ప్రతి రూపాయి అక్క చెల్లెమ్మలకు ఇవ్వాలి,
కుటుంబాలు బాగుపడతాయని నమ్మిన ప్రభుత్వం ఇది అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.