కొవ్వూరు : రాష్ట్రంలో జరిగిన 66 సర్పంచ్ ఎన్నికల్లో 30 ఏకగ్రీవాలు, 23
స్థానాల ఎన్నికల ఫలితాలతో కలిపి 53 చోట్ల వైఎస్సార్ సీపీ ప్రభంజనం
సృష్టించిందని రాష్ట్ర హోం మంత్రి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి
వనిత అన్నారు. పంచాయతీ ఉప ఎన్నికల ఫలితాలపై ఆదివారం కొవ్వూరులో మీడియా
ప్రతినిధులతో హోం మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత
మాట్లాడుతూ రాష్ట్రంలోని పంచాయతీ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్ సీపీ
విజయకేతనం ఎగరేసిందని, అత్యధిక స్థానాల్లో వైఎస్సార్ సీపీ మద్ధుతుదారులు విజయం
సాధించారన్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలనకు మద్ధుతుగా ప్రజలు వైఎస్సార్ సీపీ
మద్ధుతుదారులకు ఘన విజయం అందించారని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 66 గ్రామాల
సర్పంచ్ పదవులకు గాను 64 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయని, వాటిలోని 30 సర్పంచ్
పదవులు ఏకగ్రీవమై వైఎస్సార్సీపీ మద్దతుదారుల గెలుపు సాధించారని తెలిపారు.
మిగిలిన 34 సర్పంచ్ పదవుల ఎన్నికల్లో 23 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు
విజయ కేతనం ఎగురవేయడం జగనన్న పాలనకు ప్రజా మద్దతు తెలియజేస్తుందన్నారు. 10
స్థానాల్లో టీడీపీ మద్దతుదారులు, ఒక స్థానం జనసేన మద్దతుదారు గెలిచారన్నారు.
మొత్తం 1,062 వార్డుల్లో 63 స్థానాల్లో ఎన్నికలు జరగకపోగా ఎన్నికలు జరిగిన 243
వార్డుల్లో 149 వైఎస్సార్ సీపీ, 90 టీడీపీ, 4 జనసేన మద్దతుదారులు విజయం
సాధించారని వివరించారు. ఏకగ్రీవాలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 810 చోట్ల
వైఎస్సార్ సీపీ మద్దతుదారులు, 182 వార్డుల్లో టీడీపీ మద్దతుదారులు, 7
వార్డుల్లో జనసేన మద్దతుదారులు గెలుపొందారన్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలనకు
ఓటేసిన ప్రజలు ఎన్నికలు ఏవైనా వైఎస్సార్ సీపీ ప్రజా మద్ధతుకు తిరుగులేదని
మరోసారి నిరూపింతమైందని హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు.