వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
వైయస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ జిల్లా అధ్యక్షులు
ధర్మాన కృష్ణ దాస్
శ్రీకాకుళం : తెలుగునాట సంక్షేమానికి స్పూర్తి ప్రదాత దివంగత మహానేత డాక్టర్
వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు.
వైయస్ మహానేత అని, పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారనీ కృష్ణదాస్
కొనియాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను శ్రీకాకుళంలోని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు.
వైయస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ జిల్లా అధ్యక్షులు
ధర్మాన కృష్ణదాస్, ఏడురోడ్ల జంక్షన్ లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి
నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ వైయస్ మహానేత
అని, పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారనీ కొనియాడారు. ఆ నాటికి
రాష్ట్రంలో నిరాశ,నిస్పృహలతో ఉన్నటువంటి అన్ని వర్గాలలో భవిష్యత్ పై
కొత్త ఆశలు చిగురించే విధంగా పరిపాలనను ఆయన అందించటం వల్లే ఈనాడు
ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా అతన్ని స్మరించుకుంటారన్నారు. డాక్టర్
వైఎస్ఆర్ ఆనాడు తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా తెలుగు రాష్ట్రాలలో అనేక
కుటుంబాల నుంచి విద్యార్థులు ప్రయోజకులుగా మారి,వారి కుటుంబాలనే కాక, వారు
నివసిస్తున్న ప్రాంతాలలో ఉండే ప్రజలకు మార్గదర్శకులై
నిలుస్తున్నారన్నారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల ఫలితాలు
అప్పుడే వచ్చేస్తున్నాయి. అతి సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు
రకరకాల ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడి వారు మిగతా వారికి మార్గదర్శకంగా
ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి ఇనీషియేటివ్ అని అన్నారు. రాజశేఖర్ రెడ్డి
సుదీర్ఘమయిన ప్రజా జీవితంలో అనేక బాధ్యతలు నిర్వర్తించడం వలన అతనొక
సమగ్రమయిన నాయకుడిగా,ఇతరులెవ్వరూ అతని పద్ధతులకు సాటి రాని విధంగా
నిలిచారన్నారు. ఆయన స్పూర్తిని సీఎం వైఎస్ జగన్ తన పాలనలో మరింత ముందుకు
తీసుకువెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ కేంద్రమంత్రి డాక్టర్
కిల్లి కృపారాణి, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్పర్సన్ అందవరపు సూరిబాబు, ఎన్ని
ధనంజయరావు, డాక్టర్ దానేటి శ్రీధర్, పొన్నాడ రుషి, రొక్కం సూర్య ప్రకాష్,
శ్రీనివాస్ పట్నాయక్, రౌతు శంకర్రావు మాస్టారు, నెమలిపురి కోటేశ్వర చౌదరి,
వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గంగు శారద, యామిజాల గాయత్రి, రత్నాల
నరసింహమూర్తి, మహమ్మద్ సిరాజుద్దీన్, ఏవి రమేష్, ఎంఏ బేగ్, నల్లబారిక శీను,
సత్తిరాజు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను
నిర్వహించారు. వైయస్ చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ జిల్లా అధ్యక్షులు
ధర్మాన కృష్ణ దాస్ నివాళులు అర్పించారు. మాజీ కేంద్రమంత్రి డాక్టర్ కిల్లి
కృపారాణి, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్పర్సన్ అందవరపు సూరిబాబు, ఎన్ని
ధనంజయరావు, డాక్టర్ దానేటి శ్రీధర్, పొన్నాడ రుషి, రొక్కం సూర్య ప్రకాష్,
శ్రీనివాస్ పట్నాయక్, రౌతు శంకర్రావు మాస్టారు, నెమలిపురి కోటేశ్వర చౌదరి,
వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గంగు శారద, యామిజాల గాయత్రి, రత్నాల
నరసింహమూర్తి, మహమ్మద్ సిరాజుద్దీన్, ఏవి రమేష్, ఎంఏ బేగ్, నల్లబారిక శీను,
సత్తిరాజు తదితరులు హాజరయ్యారు.