27 నుంచి 2023 జనవరి 15 వరకూ దీక్షలు
విజయవాడ : విజయవాడ సమీపంలో ని గొల్లపూడి జైన్ కాలనీ వద్ద అత్యంత శోభమయంగా
ఏర్పాటు చేసిన భారీ సెట్టింగులో ఆదివారం జైనుల 45 రోజుల ఉపవాస దీక్షలు
లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత శనివారం గొల్లపూడి జైన్ దేవాలయం
నుండి నిర్వహించిన శోభాయాత్ర వేడుకగా సాగింది. శ్రీ సంభవనాధ్ రాజేంద్ర సురి
జైన్ శ్వేతాంభర్ ట్రిస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉపవాస దీక్షల్లో ఆదివారం
150 మంది జైనులు దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలు చేపట్టే వారి కోసం ట్రస్ట్
ఆధ్వర్యంలో భారీ బడ్జెట్ తో తాత్కాలిక ఆలయాన్ని నిర్మించారు. అలాగే భక్తులకు
అన్ని సౌకర్యాలు కల్పించాలనే తలంపుతో ప్రత్యేక బసను కూడా ఏర్పాటు చేశారు. ఈ
నెల 27 నుండీ ప్రారంభమైన దీక్షలు 2023 జనవరి 15 వరకూ కఠోర నియమాలతో
ఆచరించాల్సి ఉంటుందని ట్రిస్ట్ అధ్యక్షులు రాజు సోలంకి తెలిపారు. మునిశ్రీ
వైభవ రత్న ఈ దీక్షా కాలంలో ప్రతిరోజూ ఉపవాసాల, ఉపద్యాన, తపస్సుల,ఆరాధనల
గూర్చి ప్రవచనాలు చెబుతారని రాజు సోలంకి వివరించారు. 45 రోజులు పాటు సాగే ఈ
దీక్షలు గురువులు మోక్షమాలతో ఉపవాస విరమణ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ
కార్యక్రమాలకు ట్రస్ట్ కార్యదర్శి నరేంద్ర రాధోడ్, కన్వీనర్ మొహన్ లాల్
కొఠారి, గోల్డ్ మెడల్ అధినేత ప్రవీణ్, రిక్కా చంద్, దళపతి చంద్, ఇంద్రమల్,
ప్రవీణ్ కుమార్ భక్తులకు సేవలు అందిస్తారని రాజు సోలంకి తెలిపారు.