పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి
రాజశేఖర్గుంటూరు : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 100 శాతం ప్రతి
నిరుపేద గ్రామీణ కుటుంబానికి జాబ్ కార్డ్ ఇచ్చి వారందరూ పనిలోకి వచ్చేలా
అవగాహన కల్పించాలని అలాగే ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించడానికి
అవసరమైన పనుల అర(షెల్ఫ్ ఆఫ్ వర్క్స్) లను సిద్ధం చేసుకోవాలని పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్నారు.
మంగళవారం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో జరిగిన 26 జిల్లాల
పిడి డ్వామాల అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం పనిని హక్కుగా ఇచ్చిందని,
పథకంలో పని పొందాలంటే జాబ్ కార్డ్ తప్పనిసరి కనుక గ్రామల్లో పర్యటించి, ప్రతి
కుటుంబానికి జాబ్ కార్డ్ జారీ చేసే బాధ్యత పిడి, డ్వామాలదేనని, బడ్జెట్
ఆధారంగా కాకా డిమాండ్ ఆధారంగా ప్రణాళికలు తయారుచేసుకుని ప్రతి కుటుంబానికి
అత్యధిక ఆదాయం లభించేలా, జీవనోపాధి భద్రత పెరిగేలా, సంవత్సరమంతా ఉపాధి పనులు
జరిగేలా చర్యలు తీసుకోవాలని పిడి డ్వామాలను కోరారు. పేదరికం తగ్గింపు, వలసల
నివారణ, మహిళ సాధికారత, వ్యక్తిగత ఆస్తుల ఏర్పాటు తదితర అంశాల ప్రాధాన్యంగా
ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తూ, అన్ని సూచికల్లో అభివృద్ధి సాధించాలని
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అన్నారు. చట్టం ఉద్దేశ్యాలకు అనుగుణంగా
ఎస్.సి, ఎస్.టి, మైనారిటీ, పేదలకు సంవత్సరం పొడవున పని ఇచ్చేలా ప్రణాళికలు
తయారుచేసుకోవాలని, ముఖ్యంగా చెంచులకు 150 రోజుల పని కల్పనపై ఆలోచన చేయాలని,
తరచు క్షేత్ర పర్యటనలు చేయాలని అంటూ అధికారులు మాజీ ఐఏఎస్ శంకరన్ గారిని
ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని ఈ సందర్భంగా 26 జిల్లాల పిడి, డ్వామాలను

రాజశేఖర్ కోరారు. ఈ సదస్సులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎ.
సూర్యకుమారి మాట్లాడుతూ పిడి, డ్వామాల సలహాలు, సూచనలు తీసుకుంటూ క్షేత్ర
పరిస్థితులు అవగాహన పర్చుకుని, చట్టం నిర్దేశించిన వర్గాలు, తరగతుల వారికి
ప్రాధాన్యతనిస్తూ వారందరికి 100 రోజుల పని కల్పించి పథకాన్ని ముందుకు
తీసుకెళ్లాలని నిజమైన ప్రేరణతో పని చేయాలని అన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి
శాఖ సూచనల మేరకు ప్రతి గ్రామ పంచాయతీలో 7 రిజిష్టర్లను సక్రమంగా నిర్వహించాలని
అంటూ, అర్ధవంతమైన పనితో పటిష్టమైన ఫలితాలు సాధించాలని ఆమె అన్నారు. ఈ
సందర్భంగా విజయనగరం జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల సంఘంతో చేపట్టి పనులు
పూర్తి చేసిన అమృత్ సరోవర్ విజయగాథను పిడిలకు వివరించారు. ఈ సదస్సులో సెర్ప్
సిఇఒ ఇంతియాజ్ మాట్లాడుతూ జాబ్ కార్డుల జారీ, ఉపాధి హామీ పనికల్పనలో డ్వామా,
డిఆర్ డిఎ అనుసంధానం తో పని చేసినట్లయితే గణనీయ ఫలితాలు సాధించవచ్చని, స్వయం
సహాయక సంఘాల్లో ఉన్న దాదాపు 56 లక్షల మంది సభ్యులకు జాబ్ కార్డులు ఉన్నాయని
అయినప్పటికి ఉపాధి హామీ పథకం గురించి చర్చ జరగడం లేదని, సంఘాల సమావేశాలకు
మేట్, ఫీల్డ్ అసిస్టెంట్లు హాజరై చర్చించినట్లయితే మెరుగైన ఫలితాలు వస్తాయని
అన్నారు. జిల్లా సమాఖ్య సమావేశాల్లో డ్వామా, డిఆర్ డిఎ పిడిలు పాల్గొని రెండు
విభాగాలను అనుసంధానించుకుని, రోడ్డుకిరువైపులా మొక్కల పెంపకం, కమ్యునిటీ
ప్లాంటేషన్, మునగ తోటల పెంపకం తదితర పనుల్లో స్వయం సహాయక సంఘాలకు భాగస్వామ్యం
కల్పించే దిశగా పనిచేయాలని ఇంతియాజ్ అన్నారు. ఈ సదస్సులో ఇజిఎస్ సంచాలకులు
పి. చినతాతయ్య మాట్లాడుతూ అపార అనుభవం కల్గిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి
శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కమిషనర్ నేతృత్వంలో ఉపాధి హామీ పథకాన్ని
మరింత ప్రణాళిక బద్ధంగా అమలు పర్చాలని, పేద వారికి చట్టం ఇచ్చిన హక్కులను
పరిరక్షిస్తూ ప్రతి ఒక్క కుటుంబానికి 100 రోజుల పని కల్పనే ధ్యేయంగా పిడి,
డ్వామాలందరూ పని చేయాలని సూచించారు.
ఈ సదస్సులో శ్రీశైలం ఐటిడిఎ పిఒ, బి. రవీంద్రా రెడ్డి, ఇజిఎస్ జాయింట్
కమిషనర్లు ఎం. శివ ప్రసాద్, విజయ్ లాజరస్, సోషల్ ఆడిట్ డైరెక్టర్ జగదీశ్,
గ్రామీణాభివృద్ధి శాఖ ఇతర అధికారులు, 13 జిల్లాల పిడి, డ్వామాలు, డిబిటి
మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.