విజయవాడ : ఆర్టీసీ వంటి ప్రతిష్టాత్మక సంస్థ ఆర్జించే రాబడిలో ఏ ఒక్క రూపాయి
కూడా నష్టపోని తీరులో తనిఖీ వ్యవహారాలు నిర్వహించడం, ప్రయాణీకులకు నాణ్యమైన
సేవలందించడంలో కండక్టర్లు, డ్రైవర్లు తమ బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చేలా,
వారు క్రమశిక్షణతో వ్యవహరించేలా చూడడం లోనూ తనిఖీ అధికారులు తమ వంతు బాధ్యతలు
రాజీ లేకుండా నిర్వర్తించాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సి హెచ్. ద్వారకా
తిరుమల రావు అన్నారు. మంగళవారం విజయవాడ, విద్యాధరపురం నందలి ఆర్టీసీ
ట్రాన్స్ పోర్ట్ అకాడమీలో, రాష్ట్రంలోని వివిధ హెడ్ క్వార్టర్ స్క్వాడ్ /
విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ స్క్వాడ్ / రీజినల్ ఎన్ ఫోర్స్ మెంట్ స్క్వాడ్
ఇంచార్జ్ లు హాజరైన సమీక్షా సమావేశానికి ఎం.డి ద్వారకా తిరుమల రావు విచ్చేసి
వివిధ తనిఖీ విభాగాల ఇంచార్జ్ లను ఉద్దేశించి ప్రసంగించారు. సమావేశానికి
హాజరైన వివిధ స్క్వాడ్ ల పెర్ఫార్మెన్స్ మరియు పనితీరును సమీక్షించారు. ఏ
ప్రజా రవాణా సంస్థలోనైనా ఆదాయాన్ని పెంపొందించుకోవడం, రాబడి లోని ప్రతి
రూపాయిని జాగ్రత్తగా కాపాడుకోవడం, సంస్థ ఉద్యోగుల సంక్షేమాన్ని కాంక్షించడం
చాలా ప్రధానమని ఆయన తెలిపారు. అందులో బస్సు రాబడిని జాగ్రత్తగా సంరక్షించే
బాధ్యత తనిఖీ అధికారులదేనన్నారు. బస్సు తనిఖీ అధికారులు సంస్థ అభివృద్ధిలో తమ
వంతు బాధ్యతలు నిర్వహించాల్సిన తీరు తెన్నుల గురించి ఆయన పలు సూచనలు చేశారు. ఈ
కార్యక్రమానికి ఎం.డి తో పాటుగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎ.
కోటేశ్వరరావు, సిటీఎం (మార్కెటింగ్) విజయగీత, ట్రాన్స్పోర్ట్ అకాడమీ
ప్రిన్సిపాల్ కుమారి డి.సాంబ్రాజ్యం, డిప్యూటీ సిటీఎం (మార్కెటింగ్) జాన్
సుకుమార్ ఇంకా తదితర అధికారులు పాల్గొన్నారు