అమరావతి సచివాలయం మూడో బ్లాక్ లోని పలు కార్యాలయాలను ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి శుక్రవారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు.
ఉదయం 11గంటల సమయంలో మూడో బ్లాక్ మొదటి అంత్తసులోని సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన
సంక్షేమ శాఖ కార్యాలయాలను తొలుత ఆయన సందర్శించారు. కార్యాలయ ఆవరణలో ఫైళ్లు
పెద్ద మొత్తంలో గుట్టలుగా ఉండటాన్ని ఆయన గమనించి, ముఖ్యమైన ఫైళ్లను అన్నింటినీ
రికార్డు రూమ్ కు తరలించాలని, అనవసరమైన వాటిని పద్దతి ప్రకారం వెంటనే
డిస్పోజ్ చేయాలని అధికారులకు ఆయన సూచించారు. కార్యాలయ ఆవరణలోని పలు
సెక్షన్లను పరిశీలిస్తూ సిబ్బంది వివరాలు, వారు చేసే పనులపై ఆయన ఆరాతీశారు.
ప్రతి రోజు ఎన్ని కరెంట్స్ వస్తున్నాయి, ఎన్నింటిని డిస్పోజ్ చేస్తున్నారు,
ఎన్ని ఫైళ్లను సర్క్యిలేట్ చేస్తున్నారు తదితర అంశాలపై సమగ్ర నివేదిక
ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు.తదుపరి అదే బ్లాక్ గ్రౌండ్ ప్లోర్ లోని ఉద్యోగుల గ్రంధాలయాన్ని ఆయన సందర్శించి
ప్రతి రోజు ఎంత మంది ఉద్యోగులు ఈ గ్రంధాలయాన్ని సందర్శిస్తున్నారు, ఎంత మంది
గ్రంథ పఠనం చేస్తున్నారు అనే విషయాలను లైబ్రేరియన్ ను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సెంట్రల్ రికార్డు రూమ్ ను సందర్శించి రికార్డులు భద్రపర్చే ర్యాక్
లను పరిశీలిస్తూ రికార్డులు భద్రపరిచే పక్రియను అడిగి తెలుసుకున్నారు. తదుపరి
ఉద్యోగుల క్యాంటీన్‌ను సందర్శించి ఉద్యోగులకు రాయితీపై అందజేస్తున్న అల్పాహార,
భోజన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిస్పెన్సరీలోని పలు విభాగాలను,
ఉద్యోగుల పిల్లల ప్లే స్కూల్ ను, ఎస్.బి.ఐ. బ్రాంచ్ ను సి.ఎస్.
డా.కె.ఎస్.జవహర్ రెడ్డి సందర్శించారు.