గుంటూరు : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సచివాలయాల పరిధిలో పార్టీ
కన్వీనర్లు, ప్రతి 50 గృహాలకు గృహసారధుల ఎంపిక ఈనెల 30 వతేదీలోపు పూర్తి
చేయాలని పార్టీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ఆదేశించారని పార్టీ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలియచేశారు. ఆదివారం నాడు
పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎంఎల్ఏలు, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు,పార్టీ
పరిశీలకులు, మండల కన్వీనర్లతో పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల
రామకృష్ణారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రతి సచివాలయాలకు సంబంధించి ముగ్గురు కన్వీనర్లను ఇప్పటికే పూర్తి చేయడం
జరిగిందన్నారు. ఈనెల 20 వతేదీ లోపు గృహసారధుల నియామకాలు పూర్తి చేయాల్సి ఉన్నా
ఎమ్మెల్యేల అభ్యర్ధన మేరకు 30 వ తేదీ వరకు పొడిగించడం జరిగిందన్నారు. ఈ నెల 30
వ తేదీలోపు ఎట్టిపరిస్ధితుల్లోనూ గృహసారధుల నియామకం పూర్తి చేయాలని కోరారు.
అదే విధంగా మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో గృహసారధుల సమావేశాలు,శిక్షణా
కార్యక్రమాలను ఫిబ్రవరి ఒకటో తేదీనుంచి ఏడో తేదీ లోపు నిర్వహించాలని
సూచించారు. ఇందుకు సచివాలయాల పరిధిలోని కన్వీనర్లతో సమన్వయం చేసుకోవాలని
అన్నారు. సమావేశాలలో ఎంఎల్ఏ,నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు ముఖ్యఅతిధిగా పాల్గొని
సమీక్షించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ నిర్దేశించిన
జగనన్న సచివాలయ కన్వీనర్స్,గృహసారధులు (జేసిఎస్) స్ర్టక్చర్ ను ఏర్పాటు
చేసుకోవడంలో పార్టీ ఎంఎల్ఏలు,నియోజకవర్గ సమన్వయకర్తలు,పరిశీలకులు ప్రత్యేక
దృష్టి సారించి పనిచేయాలి. నియోజకవర్గంలో ఈ టీమ్ లన్నీ ఎఫెక్టివ్ గా ఉన్నాయా
లేదా అనేది ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఎన్నికల సమయంలో
కూడా ఈ టీమ్ లతో సమన్వయం చేసుకుని పనిచేసి విజయకేతనం ఎగురవేయాల్సి ఉంటుందనే
ప్రధానమైన అంశాన్ని గుర్తించి మసులుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో జరిగే
యుధ్దాన్ని సమర్ధంగా ఎదుర్కోవాలన్నా, ప్రజలతో మమేకమై ముందుకు సాగాలన్నా పార్టీ
ఎంఎల్ఏలు, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు ఇకపై మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలనేది
ముఖ్యమంత్రి జగన్ అభిమతమని సజ్జల రామకృష్ణారెడ్డి తెలియచేశారు. పార్టికి
కిందివరకు ఇప్పటికే యంత్రాంగం ఉన్నప్పటికి పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీలు
సమర్ధంగా పనిచేస్తున్నప్పటికి ప్యారలల్ గా సచివాలయ కన్వీనర్లు, గృహసారధులను
నియమించడం ద్వారా పార్టీ మరింత పటిష్టంగా తయారవుతుందనేది ముఖ్యమంత్రి శ్రీ
వైయస్ జగన్ ఆలోచన అన్నారు.ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వం వైపు నుంచి
సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధ వచ్చిన అనంతరం ఆ విధంగా అయితే రాష్ర్టంలోని
ప్రతి ఇంటికి పధకాల డోర్ డెలివరీ సిస్టమ్,జగనన్న స్కీమ్స్, వారికి మేసేజ్ లు
తగిన సమయంలో వెళ్ళడం, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం వంటివే కాకుండా అందుకు
తగిన విధంగా ప్రచారం వల్ల ప్రభుత్వం ఎంత ఎఫెక్టివ్ గా ప్రజలకు చేరువ అవుతుందో
ప్రత్యక్షంగా గమనించాం.