గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్పెషల్ చీఫ్
సెక్రటరీ అజయ్ జైన్ ను కలిసి వినతి సమర్పించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని
పాషా
గుంటూరు : గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా ఆధ్వర్యంలో ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సచివాలయ
ఉద్యోగుల వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సచివాలయాల శాఖ స్పెషల్ చీఫ్
సెక్రటరీ అజయ్ జైన్ ను కలిసి వినతులు అందించారు. ముఖ్యంగా ప్రోబేషన్ లో
రెండేళ్లు రెగ్యులర్ సర్వీస్ చేసిన సచివాలయ ఉద్యోగులకు గతంలో అప్పరెంటీస్
ఉపాధ్యాయులకు ఇచ్చిన విధంగా రెండు నోష్ నల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, రెండో
విడత 2020 నోటిఫికేషన్ ద్వారా సచివాలయ ఉద్యోగాలు సాధించిన దాదాపు 12వేల మంది
ఉద్యోగులకు రెండు సంవత్సరాల ప్రోబేషన్ పీరియడ్ నవంబర్ నెలాఖరు నుండి డిసెంబర్
లోపు పూర్తి కానున్న సందర్భంగా వారి ప్రోబేషన్ డిక్లేర్ చేయాలని,పోలీస్
యాంటిసిడెంట్ వెరిఫికేషన్ పూర్తి కాని వారికి పూర్తి చేయాలని, సచివాలయ
ఉద్యోగులు బదిలీల కోసం పడుతున్న ఇబ్బందులు మరోసారి వివరించి బదిలీలు
కల్పించాలని కోరారు. ఎనర్జీ అసిస్టెంట్లు, ఎనర్జీ సెక్రటరీలకు విధినిర్వహణలో
అనేకమంది ప్రాణాలు కోల్పోయారని, దీనికి క్షేత్ర స్థాయిలోని అధికారుల
నిర్లక్ష్యం మరియు బాధ్యతా రాహిత్యం కారణం అని,వారికి భద్రత కల్పించాలని,
సచివాలయ పని వేళలు కేటాయించాలని, గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శుల ప్రోబషన్
డిక్లేరేషన్ కు అవసరమైన సి.పి.టి పరీక్ష మరోసారి నిర్వహించాలని, వార్డు
ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీలు శాఖాపరమైన ఛార్జ్ షీట్ల కు సంభందించి
ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని,
కోరుతూ వినతి అందించి చర్చించడం జరిగింది. సానుకూలంగా స్పందించిన స్పెషల్ చీఫ్
సెక్రటరీ సాధ్యమైనంత త్వరలో తగిన పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ
కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా,ఫెడరేషన్ రాష్ట్ర
నాయకులు పి.మనోహర్,ఎం.శశిధర్,నగర అధ్యక్షులు స్టాలిన్ చక్రవర్తి,కె.రాజ్ కిరణ్
తదితరులు పాల్గొన్నారు.