అమెరికా : వేడెక్కుతున్న వాతావరణం కారణంగా వసంత రుతువు ముందే వస్తోందని తాజా
పరిశోధనలో వెల్లడైంది. దీనివల్ల పక్షులు గుడ్లు పెట్టే సమయం కూడా ముందుకు
జరుగుతోందని శాస్త్రవేత్తలు వివరించారు. ఫలితంగా ఆ జీవులు తక్కువగా సంతానాన్ని
ఉత్పత్తి చేస్తున్నాయని, అంతిమంగా వాటి సంఖ్య తగ్గిపోవడానికి కారణమవుతున్నట్లు
పేర్కొన్నారు. భూతాపం పెరిగే కొద్దీ ఈ సమస్య ఇంకా తీవ్రమవుతుందని వారు
హెచ్చరించారు. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, మిషిగన్ స్టేట్
యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. పక్షులు నిర్దిష్ట సమయంలోనే
గుడ్లు పెట్టాలి. ఈ ప్రక్రియ ముందుకు లేదా వెనక్కి జరిగితే విపరిణామాలు
ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గుడ్లు పెట్టే సమయంలో ప్రతికూల వాతావరణం
ఉంటే అప్పుడే కళ్లు తెరిచిన పక్షి పిల్లలు త్వరగా చనిపోతాయి. ఆహారం అందుబాటులో
ఉండే సమయం కూడా చాలా ప్రధానం. గుడ్లు పెట్టే సమయంలో పక్షులకు సహజసిద్ధంగా
తిండి అందుబాటులో ఉండాలి. లేకుంటే అవి సంతానానికి సరిగా ఆహారాన్ని అందించలేవు.
వసంత రుతువు ముందే రావడం వల్ల వాతావరణం, ఆహారం వంటి అంశాల పరంగా తలెత్తే
వైరుధ్యాలతో పక్షుల సంతానోత్పత్తి తగ్గుతుందని పరిశోధకులు తెలిపారు. 2001
నుంచి 2018 మధ్య ఉత్తర అమెరికా వ్యాప్తంగా 179 ప్రదేశాల్లో పక్షుల
తీరుతెన్నులను పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చారు.