అవేమిటో ఇప్పుడు చూద్దాం..
1.సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2
మధుమేహం, జీవక్రియ అసమతుల్యత పరిస్థితుల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.
2.సబ్జాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల చాలాసేపు కడుపు నిండిన అనుభూతి
కలుగుతుంది.
3.సబ్జా విత్తనాల్లో మల్టీవిటమిన్ లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్,
ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
4.సబ్జాల్లో ఉన్న ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ శరీరంలో కొవ్వును కరిగించడంలో,
జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది.
5.సబ్జా గింజలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఇది టైప్ 2
డయాబెటిస్ రోగులకు మంచిదని భావిస్తారు.
5.సబ్జా గింజలు శరీరాన్ని సహజంగా డిటాక్స్ చేస్తాయి. ఇది జీర్ణ వాహిక నుండి
గ్యాస్ ను తొలగించడంలో సహాయపడుతుంది.
7.అసిడిటీ గుండెల్లో మంట చికిత్సలో సబ్జా గింజలు శరీరంలో హెచ్సీఎల్ యొక్క ఆమ్ల
ప్రభావాన్ని తటస్థీకరించడంలో సహాయపడతాయి.
8.నీటిలో నానబెట్టిన సబ్జా గింజల్ని తినడం వల్ల కడుపు ప్రశాంతంగానూ, కడుపులో
మంట నుండి ఉపశమనం లభిస్తుంది.