. ‘‘నువ్వు కేరళ నుంచి వచ్చావన్న విషయం మర్చిపోతే ఎలా?’’ అంటూ ప్రముఖ నటి
సమంతను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సమంత పాశ్చాత్య శైలిలో ఇంగ్లిష్
మాట్లాడడంతో నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో
ప్రస్తుతం వైరల్‌గా మారింది.
సమంతను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సమంత పాశ్చాత్య శైలిలో ఇంగ్లిష్
మాట్లాడడంతో నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో
ప్రస్తుతం వైరల్‌గా మారింది.
రిచర్డ్ మాడెన్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో నటించిన అమెరికా టీవీ
సిరీస్ సిటాడెల్‌ను ఇండియాలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో
బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్, సమంత నటిస్తున్నారు. ఈ టీవీ సిరీస్ ప్రీమియర్ షోను
లండన్‌లో వేశారు. దీనికి సమంత, వరుణ్ ధవన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో
సమంత పాశ్చాత్య యాసలో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇదే ట్రోలింగ్‌కు కారణమైంది.
‘‘సమంత అంటే నాకు ఎంతో అభిమానం, కానీ ఆమె ఫేక్ యాసలో మాట్లాడుతోంది. భారతీయుల
సహజశైలిలో మాట్లాడితే ఏం పోయింది?’’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘‘తను
కేరళ నుంచి వచ్చిందన్న విషయాన్ని ఆమెకు ఎవరైనా గుర్తు చేయండి’’ అంటూ మరి
కొందరు కాస్తంత ఘాటు వ్యాఖ్యలు చేశారు.