పోలాకి : సమగ్ర భూ సర్వేతో రైతులకు ఎంతో మేలని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన
కృష్ణదాస్ అన్నారు. పోలాకి మండలం మబుగాం పంచాయతీలో మంగాళ్వారం నుంచి ప్రరంభమైన
జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష (సమగ్ర భూ సర్వే) కార్యక్రమానికి మాజీ
డిప్యూటీ సీఎం ధర్మన కృష్ణదాస్ కొబ్బరికాయ కొట్టి, పూజ చేసి ప్రారంభించారు.
అనంతరం డ్రోన్ ద్వారా జరుగుతున్న సర్వే పనులను పరిశీలించారు. అనంతరం ఆయన
మాట్లాడుతూ ఇది చరిత్రాత్మక ప్రయత్నమని అనారు. ఎప్పుడో వందేళ్ల కిందట జరిగిన
సర్వే అప్ డేట్ కాకపోవడం వల్ల భూ రికార్డులు తప్పుల తడలకుగా మారాయని, దీనివల్ల
రైతులు ఎల్లప్పుడూ సమస్యలు ఎదుర్కోవటాన్ని గమనించిన సీఎం జగన్మోహనరెడ్ది ఈ
బృహత్ప్రయత్నాన్ని ప్రారంభించారన్నారు. తాను రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు
కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో గొప్ప గౌరవమని పేర్కొన్నారు. ఇప్పటికే సమగ్ర
సర్వే చాలాచోట్ల పూర్తయిందని, రైతులకు భూహక్కు పత్రాలను కూడా పంపిణీ
చేస్తున్నారని చెప్పారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న ఈ సర్వే వల్ల
భువివాదాలు పరిష్కారమౌతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ముద్దాడ భైరాగినాయుడు,
కణతి కృష్ణ, రెంటికోట త్రినాధరావు, ధర్మాన లక్ష్మణ దాస్, కొయ్యాన కృష్ణ
తదితరులు పాల్గొన్నారు.