జగనన్నను గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధం
వెస్ట్‌లో ఎలాగైనా పార్టీ జెండాను ఎగరేద్దాం
ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాం
పార్టీ శ్రేణులకు మార్గ నిర్దేశంగా ఉండండి
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గారు
జేసీఎస్ క్లస్టర్ ఇన్చార్జిలు, మండల అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం
పార్టీ నాయకులు, కార్యకర్తలను అందరిని కలుపుకుని వెళ్లే విషయంలో పార్టీ జేసీఎస్ క్లస్టర్ ఇన్చార్జిలు, మండల అధ్యక్షులే కీలకమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గారు తెలిపారు. చంద్రమౌళినగర్ సాయిబాబారోడ్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం జేసీఎస్ క్లస్టర్ ఇన్చార్జిలు, మండల అధ్యక్షులతో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ సారి ఎలాగైనా పార్టీ జెండాను ఎగురేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. ఎక్కడా విబేధాలు లేకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. అన్ని డివిజన్ల లో పార్టీ కార్యక్రమాలను విజయవంతచేయాల్సిన బాధ్యత కూడా క్లస్టర్ ఇన్చార్జిలు, మండల అధ్యక్షులు తీసుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వాలు చేయని విధంగా ముఖ్యమంత్రివైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గారు రాష్ట్రంలోని ప్రజలందరికీ సంక్షేమాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఆ సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలన్నింటిలోనూ జగనన్న చేస్తున్న మంచి పనులన్నింటినీ వివరింగా చెప్పాలని తెలిపారు. కార్యక్రమంలో జేసీఎస్ క్లస్టర్ ఇన్చార్జిలు, మండల అధ్యక్షులు సురశాని వెంకటరెడ్డి, ఇన్నారెడ్డి, ఉడతా కృష్ణ, ఎండీ బాబుఖాన్, గుడిపాటి భాస్కర్, బత్తుల దేవానంద్, నూనె ఉమామహేశ్వరరెడ్డి, బండా రవీంద్రనాథ్, బైరెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.