శ్రీకాకుళం : ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశయసాధనలో ప్రతి ఒక్కరూ తమకు
నిర్దేశించిన బాధ్యతలను క్షేత్రస్థాయిలో సమన్వయంతో నిర్వహించి సత్ఫలితాలు
సాధించాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ సూచించారు.
బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జగనన్న సచివాలయ కన్వీనర్ల మండల
ఇన్చార్జిలతో, పార్టీ రాష్ట్ర పరిశీలకులు హర్షవర్ధన్ రెడ్డితో కలసి కృష్ణదాస్
సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు 30
మండలాలకు నియమించిన పార్టీ మండల కోఆర్డినేటర్లు హాజరయ్యారు. గ్రామ స్థాయి
నుంచీ పార్టీని మరింతగా ముందుకు తీసుకువెళ్లడానికి ఎటువంటి వ్యూహాలను
అనుసరించాలో వాటిని కచ్చితంగా అమలుచేయాలని అన్నారు. ఈనెల 20లోగా అన్ని
సచివాలయాల పరిధిలో గృహసారథుల నియామకాలు తప్పనిసరిగా పూర్తి కావాలని, ఆ
జాబితాలను జిల్లా పార్టీ కార్యాలయానికి అందజేసే బాధ్యత మండల ఇన్చార్జిలదేనని
స్పష్టం చేశారు.
ప్రభుత్వ కార్యక్రమాలు ఇప్పటికే ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర
వేసుకుంటున్నాయని, అదే తరహాలో పార్టీ కార్యక్రమాలు, ఆశయాలు ప్రజల మనుసుల్లో
నిలిచిపోయేలా అంకితభావంతో కృషి చేయాలన్నారు. ఈ మంత్రి డాక్టర్ సీదిరి
అప్పులరాజు, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్,
ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్ల కిరణ్ కుమార్, ఇచ్చాపురం సమన్వయకర్త పిరియా
సాయిరాజ్, ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, తమ్మినేని చిరంజీవి నాగ్, నియోజకవర్గాల
పార్టీ పరిశీలకులు ప్రసన్నకుమార్ (ఇచ్చాపురం), కెవి సూర్యనారాయణ రాజు (పలాస),
కాయల వెంకటరెడ్డి (టెక్కలి), పివి సూర్యనారాయణ రాజు (పాతపట్నం), డివిజి
శంకరరావు (శ్రీకాకుళం), తదితరులు పాల్గొన్నారు.