విజయవాడ : ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్
బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్ర
వ్యాప్తంగా సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లో డిమాండ్స్ డేను పాటించారు.
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని, జర్నలిస్టులపై దాడులు
నివారణకు హై పవర్ కమిటీని నియమించాలని, జర్నలిస్టులకు గృహ వసతి కల్పించాలని,
జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని, జర్నలిస్టులకు కార్మిక భీమా
సదుపాయం వర్తింపజేయాలని, ప్రభుత్వం నియమించే అన్ని జర్నలిస్టు కమిటీలను వెంటనే
నియమించాలని, వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ ఫండ్ కమిటీ, హై పవర్ కమిటీతో
పాటుగా ఆరోగ్యశ్రీ పర్యవేక్షణకు కమిటీ నియమించాలని, మీడియా రంగంలోని
పరిస్థితులను అధ్యయనం చేసేందుకు వీలుగా మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, మీడియా
అకాడమీలో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కు ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్
అసోసియేషన్ కు ప్రాతినిధ్యం కల్పించాలని, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న
జర్నలిస్టుల అవార్డులను వెంటనే ప్రకటించాలని కోరుతూ డిమాండ్స్ డేను అన్ని
జిల్లా కేంద్రాలలో పాటించారు. రాష్ట్ర రాజధాని లో సమాచార కార్యాలయం వద్ద
డిమాండ్స్ డే నిర్వహించిన అనంతరం సమాచార శాఖ కమిషనర్ టి విజయ్ కుమార్
రెడ్డిని కలిసి ప్రతినిధి వర్గం వినతి పత్రాన్ని అందజేసింది. ఈ ప్రతినిధి
వర్గంలో ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ వెంకట్రావు, జి ఆంజనేయులు,
ఎన్ఏజే కోశాధికారి ఏ అమరయ్య, ఫెడరేషన్ పూర్వాధ్యక్షులు పరమేశ్వరరావు, నగర
అధ్యక్ష కార్యదర్శులు కలిమి శ్రీ, నాధన్ ఉన్నారు .శ్రీకాకుళం, విజయనగరం,
విశాఖపట్నం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ గుంటూరు, బాపట్ల,
ప్రకాశం తిరుపతి, చిత్తూరు, జిల్లాలలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా
కేంద్రాలకు దూరంగా ఉన్న పలు రెవిన్యూ డివిజన్ నియోజకవర్గ కేంద్రాలలో స్థానిక
కమిటీలు అధికారులకు వినతి పత్రాలను సమర్పించారు.