నిజాయితీతో వార్తలు రాసినప్పుడు ఒత్తిడి వచ్చినా సంతృప్తికరంగా
ఎదుర్కొవచ్చని.. తెలిసి అబధ్దాలతో వార్తలు రాస్తే తద్వారా వచ్చే ఒత్తడి
అధిగమించటం కష్టమవుతుంది : ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు
విజయవాడ : జర్నలిస్టుల వృత్తి పరమైన మానసిక ఒత్తిడిలపై ప్రెస్ క్లబ్ లో అవగాహన
సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు,
ముఖ్య అతిధిగా ఏపీ ప్రభుత్వ సలహాదారులు (కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్,
ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బా రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్
రాధ రెడ్డి పాల్గొన్నారు. సదస్సులో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడీయా
జర్నలిస్టులు హాజరై ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బా రెడ్డిచే
తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు వృత్తిలో
భాగంగా మానసిక ఒత్తిడిల నుండి ఎలా అధిగమించాలన్న అంశాలపై జర్నలిస్టులకు సూచనలు
అందించారు. యోగా, ధ్యానం, చిన్న చిన్న వ్యాయామాలు, సంగీతం లాంటి కళలపై దృష్టి
పెట్టడం ద్వారా ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చని ప్రముఖ మానసిక వైద్యులు
డాక్టర్ ఇండ్ల రామసుబ్బా రెడ్డి సూచించారు. జర్నలిస్టుల్లో రక రకాల రూపాల్లో
ఒత్తిడి వుంటుందని దానిని ఎదుర్కోక తప్పదని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్
కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. అయితే నిజాలతో కూడిన వార్తల ఒత్తిడికి
అబధ్దాలతో నిండిన వార్తలతో ఒత్తిడికి చాల తేడా వుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
నిజాయితీతో వార్తలు రాసినప్పుడు ఒత్తిడి వచ్చినా సంతృప్తికరంగా ఎదుర్కొవచ్చని
తెలిసి అబధ్దాలతో వార్తలు రాస్తే తద్వారా వచ్చే ఒత్తడి అధిగమించటం
కష్టమవుతుందని జర్నలిస్టులకు ఆయన సూచించారు. ఇటీవల కాలంలో ఓ వర్గం మీడియాలు
అబధ్దపు వార్తలతో మరీ మోతాదు మించిపోతుందని.. సంబంధింత జర్నలిస్టులకు
మానసికంగా అపరాధభావం కారణంగా ఇంకా ఒత్తిడి పెరిగే అవకాశముందని ప్రెస్ అకాడమీ
చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు హెచ్చరించారు.
సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తూ ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్న జర్నలిజం
వృత్తి అతి కీలకమైంది. వృత్తి రీత్యా ఎన్నో ఒత్తిడిలను అధిగమిస్తున్న
జర్నలిస్టులకు ఇలాంటి అవగాహాన సదస్సులు ఎంతగానో దోహదపడతాయని, జర్నలిస్టులకు
ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ వుంటుందని ఏపీ ప్రభుత్వ సలహాదారులు
(కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్ అన్నారు. ఈ సందర్భంగా ఐజేయూ జాతీయ
ఉపాధ్యక్ష్యులు అంబటి అంజనేయులు, ప్రెస్ క్లబ్ అధ్యక్ష్యులు నిమ్మరాజు
చలపతిరావు, ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ అధ్యక్ష్యులు చావా రవి,
ఏపీయూడబ్ల్యూజే ఉపాధ్యక్ష్యులు కె.జయరాజ్, సీనియర్ జర్నలిస్ట్ షేక్ బాబు లతో
పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొని ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని
శ్రీనివాసరావు, ఏపీ ప్రభుత్వ సలహాదారులు (కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్,
ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బా రెడ్డి దంపతులకు శాలువాలు
కప్పి పుష్పగుఛ్చాలతో ఘనంగా సత్కరించారు. అవగాహన సదస్సును ప్రెస్ అకాడమీ
కార్యదర్శి మామిడిపల్లి బాలగంగాధర తిలక్ సమన్వయపరిచారు.