విజయవాడ : మహిళా సాధికారత, సమానత్వం అనేది సమిష్టి కృషితోనే సాధ్యమవుతుందని
మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. విజయవాడ నగరంలోని
సిద్ధార్థ ఉమెన్స్ కాలేజీ నందు స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్, రోటరీ క్లబ్
ఆఫ్ మిడ్ టౌన్ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ
కార్యక్రమానికి మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ
ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మహిళా సాధికారత అనేది కుటుంబ స్థాయి నుంచే
ప్రారంభం కావాలన్నారు. సాధికారత వల్ల అన్ని రంగాల్లో సమానత్వం
సాధ్యమవుతుందన్నారు. కొన్ని సమూహాల వల్ల సాధ్యం కాదని. వ్యవస్థ యంత్రాంగం
పూనుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లోని మహిళల శ్రమ ప్రధానం, మహిళలు తమ
కష్టాన్ని గుర్తించాలని అనాదిగా ఆవేదన పడుతున్నారు. నిజానికి మారుతున్న
పరిస్థితులు ప్రపంచీకరణ, అధునీకరణ, సాంకేతికత తదితర కారణాలవల్ల కొంత మార్పు
కనబడుతుంది. మహిళలు శాసించే స్థాయికి ఎదిగినప్పుడే నిజమైన సాధికారత, సమానత్వం
సాధ్యమన్నారు.
అనంతరం సిబిఐ పూర్వపు జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ తదితరులు
ప్రసంగించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన ఇందిరా ప్రియదర్శిని ఫ్యామిలీ
కోర్ట్ జడ్జి, డాక్టర్ శనక్కాయల అరుణ గైనకాలజిస్ట్, బి. సుప్రియ శశి
ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, టి విజయలక్ష్మి సిద్దార్థ డైరెక్టర్, హైమ ,
రాధాకుమారి సోషల్ వర్కర్ , డాక్టర్ శ్రీవల్లి (వీణ), ఆర్టిస్ట్ టి. రజిని,
డాక్టర్ జీవన లత, తొమ్మిది మంది మహిళలకు ఉమెన్స్ స్పాట్లైట్ అవార్డ్స్ ను
అందజేశారు. అనంతరం నిర్వహకులు మహిళా కమిషన్ చైర్ పర్సన్వా సిరెడ్డి పద్మను
ఘనంగా సన్మానించారు.