నెలూరు : సమిష్టి పోరాటంతో టోల్ ప్లాజా ఏర్పాటును అడ్డుకుందామని నెల్లూరు
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపిచ్చారు. నెల్లూరు రూరల్
నియోజకవర్గం పరిధిలో నిర్మాణం చేపడుతున్న టోల్ ప్లాజా నిర్మాణాన్ని నెల్లూరు
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టిడిపి నాయకులు కోటంరెడ్డి
గిరిధర్ రెడ్డి సందర్శించారు. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఈ టోల్ ప్లాజా
నిర్మాణం చేపడితే నెల్లూరు నగరంలోకి భారీ వాహనాలు ప్రవేశించి యాక్సిడెంట్ జోన్
గా మారే అవకాశం ఉందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. 2015లో ఈ టోల్
ప్లాజా నిర్మాణాన్ని ఇక్కడే కట్టాలని ఆలోచన చేసినప్పుడు అన్ని రాజకీయ
పార్టీలను, అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పోరాటం చేసి అందరి సహాయ సహకారాలతో
టోల్ గేట్ ను అడ్డుకోవడం జరిగిందన్నారు. మే నెలలోనే టోల్ గేట్ ఆపేశాను అని
ప్రగల్బాలు పలుకుతున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి జూన్ 21వ తేదీన టోల్ గేట్ నిర్మాణ
పనులకి వర్క్ ఆర్డర్ ఎలా ఇస్తారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ప్రశ్నించారు. స్థానిక పార్లమెంట్ సభ్యులుగా మీరుండి టోల్ గేట్ కి అగ్రిమెంట్
చేసి, వర్క్ ఆర్డరు ఇచ్చి, పది రోజుల నుంచి పనులు జరుగుతుంటే మీకు సమాచారం
లేకపోవడం సిగ్గుచేటని, టోల్ గేట్ అడ్డుకునేందుకు జిల్లా మంత్రి కాకాని
గోవర్ధన్ రెడ్డి, స్థానిక పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి తో సహా
అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పోరాటం చేసి ఈ టోల్ ప్లాజా ను అడ్డుకుందామని
శ్రీధర్ రెడ్డికోరారు.