వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
జోగుళాంబ గద్వాల్ జిల్లా అభివృద్ధికి పారదర్శకంగా, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా జిల్లా అదికారులందరూ సమిష్టి బాద్యత వహించి పనిచేయాలని ఉమ్మడి జిల్లా ఇంచార్జి , రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఐ డి ఓ సి కాన్ఫరెన్స్ హాల్ లో ఆరోగ్య ,విద్యా , నీటి పారుదల, రెవెన్యూ శాఖల అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు .
ఈ సమీక్ష లో మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్య ,విద్యా , నీటి పారుదల, రెవెన్యూ శాఖలపై దృష్టి పెట్టాలన్నారు . ప్రతి మండలం ,ప్రతి గ్రామంలో సంబంధించి ప్రభుత్వ వక్ఫ్ భూములకు సంబంధించి రికార్డు ఉండాలన్నారు. , ప్రభుత్వ భూములకు ఒరిజినల్ భూరికార్డు లు ఉండలనన్నారు. జిల్లా వైద్య అధికారులతో జిల్లాకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు . జిల్లాలోని నాలుగు ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు ఈఈ ని అడిగి తెల్సుకున్నారు గత మూడు సంవత్సరాలలో ఎన్ని ఎకరాలకు నీరు అందించారని అడిగి తెలుసుకున్నారు. గట్టు ఇరిగేషన్ ,జూరాల ప్రాజెక్ట్, రాజోలి, నెట్టంపాడు నాల్గు ప్రాజెక్ట్ లకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ తయారు చేయాలనీ ఇదిగేషణ్ అధికారులకు ఆదేశించారు. విద్యకు విద్యుత్ కు సంబంధించిన అధికారులతో వివరాలు అడిగి తెల్సుకున్నారు, ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవలన్నారు. ప్రజలకు మంచి సేవలు అందించడానికి అధికారులు బాధ్యతయుతంగా పనిచేయాలన్నారు.
ఈ సందర్బంగా శిశు సంక్షేమ శాఖ అద్వర్యం లో ఏర్పాటు చేసిన వికలాంగులకు స్కూటి లను మంత్రి గారి చేతుల మీదుగా పంపిణి చేశారు.
ఈ సమీక్ష సమావేశం లో జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ , జిల్లా జెడ్పి చైర్మెన్ సరిత, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్ రెడ్డి , ఎమెల్యే విజయుడు , అడిషనల్ ఎస్ పి రవి , అదనపు కలెక్టర్ లు అపుర్వ్ చౌహాన్, చీర్ల శ్రీనివాసులు ఆర్ డి ఓ చంద్ర కళ , జిల్లా అధికారులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.