హరితహారం సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి కోరిక మేరకు మెడికల్ కళాశాల
ఏర్పాటుకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.
ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు 100 సీట్లతో మెడికల్ కళాశాల
జనరల్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తూ బుధవారం జీవో విడుదల చేసిన వైద్య ఆరోగ్య శాఖ
మహేశ్వరం నియోజకవర్గ ప్రజల తరుపున ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు: మంత్రి సబితా
ఇంద్రారెడ్డి
హైదరాబాద్ : మహేశ్వరంకు మెడికల్ కళాశాల మంజూరు చేస్తూ ప్రభుత్వం వైద్య ఆరోగ్య
శాఖ బుధవారం జీవో జారీ చేసింది.100 మెడికల్ సీట్లతో పాటు జనరల్ ఆస్పత్రి
ఏర్పాటుకు కార్యాచరణ ప్రారంభిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.ఇటీవలి మహేశ్వరం లో
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పర్యటన సందర్భంగా విద్యా శాఖ మంత్రి సబితా
ఇంద్రారెడ్డి గారి కోరిక మేరకు మహేశ్వరం నియోజకవర్గానికి మెడికల్ కళాశాల
మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.ఆ హామీ మేరకు బుధవారం
నాడు వైద్య ఆరోగ్య శాఖ జీవో జారీచేసింది. దాంతో సర్వత్రా హర్షం వ్యక్తం
అవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కి నియోజకవర్గ ప్రజల తరపున మంత్రి సబితా
ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. దినదినాభివృద్ది చెందుతున్న మహేశ్వరం
ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాటు అవుతున్న ఫ్యాక్టరీలు, అంతర్జాతీయ సంస్థలతో
పాటు అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి దగ్గరగా ఉండటంతో మెడికల్ కళాశాల,
ఆస్పత్రి మంజూరు చేయటం పట్ల స్థానికులు హర్షం చేస్తున్నారు.