హైదరాబాద్ : ఆధ్యాత్మిక క్షేత్రం బాసరను సరికొత్తగా నిర్మించేందుకు దేవాదాయశాఖ
మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఆగమశాస్త్ర నియమావళి ప్రకారం కర్ణాటకలోని
శృంగేరి పీఠం నుంచి అనుమతి తీసుకొని ప్లాన్‌ను అమలు చేయాలని భావిస్తోంది. ఆలయ
అభివృద్ధికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేయగా ఇప్పటికే పలు
పనులను ప్రారంభించింది. దక్షిణ భారతావనిలోని ప్రసిద్ధ చదువుల క్షేత్రం బాసరలో
సరికొత్తగా ఆలయాన్ని నిర్మించేందుకు దేవాదాయశాఖ కసరత్తు ప్రారంభించింది.
ఆగమశాస్త్ర నియమావళి ప్రకారం కర్ణాటకలోని శృంగేరి పీఠం నుంచి అనుమతి తీసుకొని
మాస్టర్‌ప్లాన్ అమలు చేయాలని భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.50
కోట్లు మంజూరు చేయగా ఇప్పటికే రూ.8 కోట్లతో ఆలయ పరిసరాల్లోని విశ్రాంతి భవనాల
మరమ్మతులు..తదితర పనులు చేపట్టింది. రూ.22 కోట్లతో ప్రస్తుత గర్భాలయాన్ని
కృష్ణశిలలతో ఆధునిక హంగులతో నిర్మించడానికి ప్రణాళిక రూపొందిస్తోంది.మహా సరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి అమ్మవారు కొలువైన ఆధ్యాత్మిక క్షేత్రం బాసర.
మహంకాళి విగ్రహం ఇప్పుడు పైఅంతస్తులో ఉంది. గర్భగుడిలో మహా సరస్వతి
విగ్రహానికి కుడివైపున మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ఉంది. ఆగమ శాస్త్రం
ప్రకారం సరస్వతీ అమ్మవారి దర్శనం అనంతరం పక్కనే ఉన్న మహాలక్ష్మి అమ్మవారి
ప్రతిమ కనిపించేలా ఉండాలి. అయితే ఇప్పుడు భక్తులు ప్రత్యేకంగా చూస్తే తప్ప
మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం కనిపించదు. అందుకని ఇప్పుడున్న ప్రాకార మండపాన్ని
పూర్తిగా తొలగించి కొత్త మండపాన్ని చేపట్టే ప్రణాళిక రూపొందుతోంది. ప్రాకార
మండపానికి తూర్పు/పశ్చిమ దిశలో ఏడంతస్తులతో రెండు రాజ గోపురాలు, ఉత్తర/దక్షిణ
దిశల్లో అయిదంతస్తులతో మరో రెండు రాజగోపురాలు నిర్మించేందుకు
యోచిస్తున్నారు.ఇప్పుడున్న ప్రాకార మండపం మరో 50 మీటర్లు ముందుకు జరుగుతుంది.
గర్భగుడే కాకుండా పూర్తిగా ఆలయాన్నంతా యాదాద్రి మాదిరిగా మొత్తం కృష్ణశిలలతోనే
నిర్మించాలనే ఆలోచన ఉన్నప్పటికీ ప్రభుత్వం అనుమతించాల్సి ఉంది. ప్రస్తుతం 10
అడుగుల పొడవు 10 అడుగుల వెడల్పుతో ఉన్న గర్భగుడి 25.5 అడుగుల వెడల్పు, 16.5
అడుగుల పొడవు కానుంది. 6.5 అడుగుల వెడల్పున్న ముఖద్వారాన్ని 18.5 అడుగులకు
పెంచాలని ఆ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.

అవసరమైతే మరిన్ని నిధులు : ”ఆలయ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసేందుకు ఇప్పటికే
రూ.50 కోట్లు మంజూరు చేశాం. అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేస్తాం. భక్తులకు
ఏ ఇబ్బందులు తలెత్తకుండా నూతన ప్రణాళిక ఉండనుంది. ఆధ్యాత్మికతతో పాటు
ఆహ్లాదంతో కూడిన వాతావరణం ఉంటుందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
తెలిపారు.