ప్రముఖ కథానాయకుడు షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల
ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. అట్లీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమా ప్రివ్యూ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలతో
అలరించడమే కాకుండా సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులు అడిగే ప్రశ్న లకు
చమత్కారంగా బదులిస్తుంటారు షారుక్. ఆయన ఇటీవల ఓ అభిమానికి ‘జవాన్’ సినిమా
నుంచి పోస్టర్ ను త్వరలో విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. తాజాగా ఆ మాటను
నిలబెట్టుకున్నట్లుగా చెప్తూ సినిమా నుంచి తన ఫొటోల్ని ట్విటర్ ద్వారా విడుదల
చేశారు షారుక్. ‘తిరిగి పనిని ప్రారంభించాలి ‘జవాన్’ విడుదలకు సిద్ధం
అవుతోంది. ఆస్క్ఎస్ఆర్ కోసం మీ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు.
థియేటర్లలో కలుద్దాం’ అని వ్యాఖ్యల్ని జోడించారు. ఈ పోస్టర్ లో గుండుతో,
చేతిలో గన్ ప్రతినాయకుడి ఛాయలున్న ఓ కొత్త అవతారంలో కనిపిస్తూ ప్రేక్షకుల్లో
ఆసక్తి రేకెత్తిస్తున్నారు షారుక్. ఆయన ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్న
సంగతి తెలిసిందే. నయనతార, దీపికా పదుకొణె, విజయ్ సేతుపతి తదితరులు కీలక
పాత్రలో నటిస్తున్నారు. సమాజంలో జరుగుతున్న తప్పులను సరిదిద్దడానికి సిద్ధంగా
ఉన్న ఓ వ్యక్తి ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు