హైదరాబాద్ : ఫైటర్‌జెట్ పైలట్లలో మహిళలు ఎక్కువమంది ఉండటం సంతోషదాయకమని
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో
నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు రివ్యూయింగ్ ఆఫీసర్‌గా
రాష్ట్రపతి హాజరయ్యారు. క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం
రాష్ట్రపతి మాట్లాడారు. ‘‘కంబైన్డ్ గ్యాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొన్నందుకు
సంతోషంగా ఉంది. క్యాడెట్లకు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు. దేశం కోసం
ప్రాణాలర్పించిన వారి సేవలను క్యాడెట్లు గుర్తుంచుకోవాలి. టర్కీ భూకంప సహాయక
చర్యల్లో మన వాయుసేన బాగా పనిచేసింది. కరోనా సమయంలోనూ వాయుసేన అద్భుతంగా
పనిచేసింది. సవాళ్లను ఎదుర్కొనేందుకు సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలి.
సుఖోయ్ జెట్‌లో ప్రయాణం గొప్ప అనుభూతి ఇచ్చింది’’ అని ముర్ము తెలిపారు. కాగా
పరేడ్‌కు రివ్యూయింగ్ అధికారిగా రాష్ట్రపతి వ్యవహరించడం ఇదే మొదటిసారి కావడం
విశేషం.