నటి రెబెల్ విల్సన్ సరోగసీ ద్వారా ఆడపిల్లను సంతానంగా పొందింది. ఆమె తన కుమార్తెకు రాయిస్ లిలియన్ అని పేరు పెట్టారు. రెబెల్ విల్సన్ తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో తన బిడ్డ చిత్రాన్ని పంచుకున్నారు. “గత వారం సర్రోగేట్ ద్వారా నా మొదటి బిడ్డ రాయిస్ లిలియన్ పుట్టినట్లు ప్రకటించడం గర్వంగా ఉంది, పాప పట్ల నాకున్న ప్రేమను కూడా వర్ణించలేను. పాప ఒక అందమైన అద్భుతం! ప్రత్యేకంగా నా బిడ్డకు జన్మనిచ్చిన నా అందమైన సర్రోగేట్కు ధన్యవాదాలు. ఇది అద్భుతమైన బహుమతి. ఉత్తమ బహుమతి.” అంటూ నటి రెబెల్ విల్సన్ పోస్ట్ చేసింది.